Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అక్రమ మైనింగ్‌పై హైడ్రా ఉక్కుపాదం.. ఏకకాలంలో ఆరు చోట్ల ఆకస్మిక దాడులు

అక్రమ మైనింగ్‌పై హైడ్రా ఉక్కుపాదం.. ఏకకాలంలో ఆరు చోట్ల ఆకస్మిక దాడులు

వార్త 1 month ago

HYDRA Raids Rangareddy: ప్రభుత్వ ఆదాయానికి కోట్ల రూపాయల గండి కొడుతూ అక్రమంగా కొనసాగుతున్న మైనింగ్, స్టోన్ క్రషింగ్, రెడీ మిక్స్ ప్లాంట్ల (ఆర్ఎంసీ)పై హైడ్రా మంగళవారం భారీ ఎత్తున ఉక్కుపాదం మోపింది.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు హైడ్రా, రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), పోలీసు శాఖల సమన్వయంతో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలో ఏకకాలంలో ఆరు చోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమ యూనిట్లను యంత్రాలతో కూల్చివేశారు.

Read Also: Konda Surekha : కొండా సురేఖ పై బిజెపి ఆగ్రహం

శంషాబాద్ పరిధిలోని కొత్వాల్‌గూడ, వట్టినాగులపల్లి, గండిపేట్ తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై అధికారులు దృష్టి సారించారు. ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లు, 12 రెడీ మిక్స్ ప్లాంట్లను ధ్వంసం చేసి సీజ్ చేశారు. కోర్ అర్బన్ రీజినల్ ఎకానమీ పరిధిలో అనుమతులు లేకుండా కొనసాగుతున్న ఈ యూనిట్లు ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం కలిగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

బయటపడిన బడా సంస్థల అక్రమాలు…

కొత్వాల్‌గూడ శివారులో రాఘవా స్టోన్ క్రషర్స్, వట్టినాగులపల్లిలో పరమేశ్వరం స్టోన్ క్రషర్స్, శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్, పృథ్వి స్టోన్ క్రషర్స్, గౌలిగడ్డిలో గ్రేట్ ఇండియా మైనింగ్ సంస్థ, మత్త భగత్‌సింగ్ మైనింగ్ సంస్థలు అనుమతులు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. మైనింగ్, పీసీబీ అనుమతులు లేకపోవడం, కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడం వంటి ఉల్లంఘనలు వెలుగులోకి రావడంతో కఠిన చర్యలు చేపట్టారు.

HYDRA Raids Rangareddy: ప్రజల ఫిర్యాదులతో కదిలిన యంత్రాంగం…

అక్రమ తవ్వకాల వల్ల కాలుష్యం, రాళ్ల పేలుళ్లు, భూకంపనలతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేశారు. కాలుష్య నియంత్రణ మండలి, మైనింగ్ శాఖలు హెచ్చరికలు జారీ చేసినా నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో చివరకు జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగి హైడ్రా ద్వారా ఉక్కుపాదం మోపించింది. ఈ చర్యపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

'భూ భారతి' డౌన్ తో తెలంగాణ వ్యాప్తంగా నిలిచిన రిజిస్ట్రేషన్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha