తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ధరణి స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టిన 'భూ భారతి' పోర్టల్ నేడు తీవ్ర సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొంది. ఉదయం నుంచే పోర్టల్ సర్వర్ డౌన్ కావడంతో రాష్ట్రంలోని దాదాపు అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోయింది.
భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, గిఫ్ట్ డీడ్లు వంటి కీలకమైన పనుల కోసం వచ్చిన ప్రజలు సర్వర్ ఎప్పుడు వస్తుందో తెలియక అయోమయానికి గురయ్యారు. సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన చిన్నపాటి లోపం కారణంగానే ఈ అంతరాయం ఏర్పడిందని ప్రాథమిక సమాచారం అందుతోంది.
Read Also : సమన్వయం లేని సిలబస్తో కొత్త సమస్యలు
Bhu Bharathi నరకప్రాయంగా నిరీక్షణ.. అవస్థల్లో ప్రజలు
రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్లు బుక్ చేసుకున్న వందలాది మంది ప్రజలు ఉదయం నుంచే రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద బారులు తీరారు. సర్వర్ పనిచేయకపోవడంతో భూముల నమోదు, మ్యుటేషన్ ప్రక్రియలు సాగక గంటల తరబడి కార్యాలయాల ముందే నిరీక్షించాల్సి వచ్చింది. ముఖ్యంగా దూరం ప్రాంతాల నుంచి వచ్చిన వారు, ముహూర్తాల ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని భావించిన వారు ఈ అంతరాయంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోర్టల్ అప్‌లోడ్ కాకపోవడం, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ సాధ్యపడకపోవడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి.
సాంకేతిక లోపమే కారణం.. పునరుద్ధరణ దిశగా చర్యలు
కొత్తగా అమలులోకి తెచ్చిన ఈ పోర్టల్‌లో డేటా లోడ్ పెరగడం లేదా సర్వర్ కాన్ఫిగరేషన్ సమస్యల వల్ల ఈ సాంకేతిక లోపాలు తలెత్తినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి భారీ స్థాయిలో లాగిన్స్ జరగడం వల్ల కూడా సర్వర్ క్లిచ్ ఏర్పడి ఉండవచ్చని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పునరుద్ధరించేందుకు సాంకేతిక బృందాలు శ్రమిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. త్వరలోనే పోర్టల్ యథావిధిగా అందుబాటులోకి వస్తుందని, పెండింగ్‌లో ఉన్న స్లాట్‌లను త్వరగా క్లియర్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

