Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అక్టోబర్ నుంచి కొత్త వితంతు పింఛన్లు

అక్టోబర్ నుంచి కొత్త వితంతు పింఛన్లు

వార్త 4 days ago

AP New Pensions:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హులైన వితంతువులకు శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో కొత్త పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియ ఈ నెలలోనే ప్రారంభం కానుంది.

ముఖ్యంగా భర్త కోల్పోయి పింఛను లేని నిరుపేద వితంతువులకు ఈ పథకంలో మొదటి ప్రాధాన్యం కల్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అటువంటి మహిళలు సుమారు 1.50 లక్షల మంది ఉంటారని ప్రభుత్వం అంచనా వేసింది. సెప్టెంబర్ నెలలో వీరందరి నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిశీలిస్తారు. అన్ని అర్హతలు ఉన్నవారికి అక్టోబర్ ఒకటి నుంచి ప్రతి నెలా రూ.4000 పింఛను నేరుగా అందించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెర్ప్ అధికారులు అన్ని ఏర్పాట్లు వేగవంతం చేశారు. గతంలో పింఛను అందక ఇబ్బంది పడుతున్న మహిళలకు ఈ నిర్ణయం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.

Read also: TTD ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం నివాసంలో ఏసీబీ ఆకస్మిక సోదాలు!

 AP New Widow Pensions October 2026

ఎన్టీఆర్ భరోసా స్పౌజ్ పింఛన్ల పంపిణీ వివరాలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా అర్హులైన వారికి అండగా నిలుస్తోంది. పింఛను తీసుకుంటున్న భర్త మరణిస్తే ఆ భార్యకు స్పౌజ్ కేటగిరీ కింద కొత్త పింఛను మంజూరు చేస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత ప్రతి నెలా క్రమం తప్పకుండా అర్హులైన భార్యలకు పింఛన్లు అందిస్తున్నారు. సెప్టెంబర్ మొదటి తేదీన కొత్తగా 6,268 మందికి స్పౌజ్ పింఛన్లు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,30,953 మంది లబ్ధిదారులు ఈ స్పౌజ్ పింఛన్ల ద్వారా లబ్ధి పొందుతున్నారు. వీరందరికీ ప్రతి నెలా రూ.4000 చొప్పున ప్రభుత్వం పింఛను అందిస్తోంది. దీనికోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.92.38 కోట్లు ఖర్చు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన సుమారు 72 వేల మంది స్పౌజ్ పింఛన్లను కూడా ఈ ప్రభుత్వం వచ్చాక పునరుద్ధరించడం విశేషం.

AP New Pensions:నిరంతర ప్రక్రియగా పెరుగుతున్న లబ్ధిదారుల సంఖ్య

స్పౌజ్ కేటగిరీ పింఛన్ల ప్రక్రియ రాష్ట్రంలో నిరంతరంగా కొనసాగుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో పింఛను అందేలా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. 2025 జూలై నాటికి ఈ స్పౌజ్ పింఛన్ల సంఖ్య లక్షకు చేరగా ఇప్పుడు అది 2.30 లక్షలకు పెరిగింది. ఈ కేటగిరీ కింద ప్రతి నెలా సగటున 7,622 మంది కొత్తగా పింఛన్లు అందుకుంటున్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సామాజిక భద్రత కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోంది. వితంతువుల కోసం ప్రత్యేకంగా చేపట్టబోయే ఈ కొత్త దరఖాస్తుల ప్రక్రియ ద్వారా లక్షలాది మందికి లబ్ధి చేకూరుతుంది. అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లు అందు అందుబాటులోకి రానుండటంతో లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శక విధానంలో అర్హుల ఎంపిక జరుగుతుండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛన్లు మంజూరు అవుతున్నాయి.

Epaper: epaper.vaartha.com

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు బర్త్‌డే విషెస్ తెలిపిన ప్రముఖులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha