Medak: మండల కేంద్రమైన అల్లాదుర్గం లో బేతాళ స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శుక్రవారం పోలేరమ్మ దేవతకు బోనాలు, రథోత్సవ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమైన బోనాలు, రథోత్సవం ను అల్లాదుర్గం నుండి ఊరేగింపుగా ఎంతో వైభవంగా కన్నుల పండుగగా ఆలయం వరకు తీసుకెళ్లారు. రథముపై పోలేరమ్మ దేవతను అధిష్టించి పట్టణ వీధుల్లో వివాహరించి కటాక్షించారు.
Read Also: Good Friday 2026 Choutakur: చౌటకూర్ మండలంలో ఘనంగా గుడ్ ఫ్రైడే ఆరాధనలు
రథము ముందు భజన బృందాలు, డప్పు వైద్యాలతో, కోలాటాలతో, ఆధ్యాత్మిక వాతావరణన్ని మరింత భక్తి రసమయం చేశాయి. భక్తులు భక్తిశ్రద్ధలతో రాతాన్ని లాగుతూ అడుగడుగునా కర్పూర నిరాజనాలు సమర్పించారు. పోలేరమ్మ దేవతకు స్థానిక ప్రజలు ఓవైపు బోనాలు తీస్తుండగా, మరోవైపు వ్ర మరోవైపు రాతాన్ని ఊరేగింపుగా నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు తలపై పెట్టుకుని ఊరేగింపుగా తీసుకపోయి పోలేరమ్మ ఆలయం వరకు చేరుకొని ఆలయం చుట్టూరా ఐదు సార్లు బోనాలతో ప్రదక్షణ చేసి అమ్మవారికి సమర్పించారు.
Medak: పోలీసు బందోబస్తు
బోనాలు తీస్తుంటే బోనాల ముందు శివసత్తుల నృత్యాలు, డబ్బు వాయిద్యాలతో పోలేరమ్మ దేవతకు గోవిందా గోవిందా అనే నామస్మరణతో ఈ ప్రాంతమంతా మారు మ్రోగింది. ఏ ఉత్సవాలను తిలకించడానికి వందలాదిమంది భక్తులు తరలివచ్చారు. అనంతరం పోలేరమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కలను చెల్లించుకున్నారు. ఈ బోనాలు, రథోత్సవ కార్యక్రమాల ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అల్లాదుర్గం ఎస్సై శంకర్ తమ పోలీస్ బందోబస్తు నిర్వహించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

