Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అల్లు అర్జున్ రాకా లుక్ పై బాద్షా కామెంట్స్

అల్లు అర్జున్ రాకా లుక్ పై బాద్షా కామెంట్స్

వార్త 2 months ago

కాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తాజా చిత్రం 'రాకా' (Raaka) ఫస్ట్ లుక్ విడుదలై సోషల్ మీడియాను ఊపేస్తోంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read Also : AP Transport Department: ఏపీలో స్లీపర్ బస్సుల నిషేధం? బస్సు ప్రమాదాల నివారణకు కొత్త రూల్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా దర్శకుడు అట్లీ తన తదుపరి చిత్రం ‘రాకా’ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో బన్నీ లుక్ అత్యంత పవర్‌ఫుల్ గా, ఊరమాస్ గా ఉండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ లుక్ చూసిన బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. “అల్లు అర్జున్ గారు.. మీలాగే మీ పోస్టర్ కూడా అద్భుతంగా ఉంది. మీ ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న ‘రాకా’ కోసం నేను కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. అట్లీ మాటల్లో చెప్పాలంటే ఇది మాస్.. మాస్.. మాస్!!” అంటూ షారుఖ్ పోస్ట్ చేయడం విశేషం.

అట్లీ-బన్నీ కాంబో – జవాన్ రేంజ్ అంచనాలు

దర్శకుడు అట్లీ గతంలో షారుఖ్ ఖాన్‌తో తీసిన ‘జవాన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు అదే దర్శకుడు సౌత్ సెన్సేషన్ అల్లు అర్జున్‌తో ‘రాకా’ చిత్రాన్ని ప్లాన్ చేయడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. షారుఖ్ స్వయంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రమోట్ చేస్తూ పోస్టర్‌ను షేర్ చేయడంతో, ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రకంపనలు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అట్లీ తనదైన శైలిలో బన్నీని ఏ రేంజ్ మాస్ అవతార్‌లో చూపిస్తారోనని ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తుక్కుగూడ ఫ్యాబ్ సిటీలో ఆకస్మిక తనిఖీ చేసిన డీజీపీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha