Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అల్లూరి జిల్లాలో భారీ పేలుడు.. నలుగురు మృతి!

అల్లూరి జిల్లాలో భారీ పేలుడు.. నలుగురు మృతి!

వార్త 9 hrs ago

Pinakota Blast: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి మండలం పినకోట సమీపంలో భారీ పేలుడు సంభవించింది.

ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

Bihar Fire Accident: బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 8 మంది మృతి!

రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రమాదం

పినకోట సమీపంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు ధాటికి అక్కడ ఉన్న టిప్పర్‌ పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఘటన తీవ్రతకు మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం.

ఆస్పత్రికి క్షతగాత్రుల తరలింపు

పేలుడు జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Pinakota Blast: ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు గల కారణాలు, ప్రమాద సమయంలో అక్కడ ఎంతమంది ఉన్నారు అనే అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Epaper: epaper.vaartha.com

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha