Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత!

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత!

వార్త 10 hrs ago

Shamshabad Airport: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. కౌలాలంపూర్‌ వెళ్లేందుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి సుమారు రూ.1.56 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనతో విమానాశ్రయంలో కలకలం నెలకొంది.

Read Also :AP: మహిళలపై నేరాల కేసుల్లో దేశంలో ఏపీకి రెండో స్థానం

అనుమానంతో తనిఖీలు

శనివారం ఉదయం ఇద్దరు ప్రయాణికులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వారు ఎయిర్‌ఏషియా ఏకే-68 విమానంలో కౌలాలంపూర్‌ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే వారి ప్రవర్తనపై అనుమానం రావడంతో డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వారి వద్ద భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

రూ.1.56 కోట్ల విలువైన కరెన్సీ స్వాధీనం

పట్టుబడిన విదేశీ కరెన్సీ విలువ భారత కరెన్సీలో సుమారు రూ.1.56 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశారు. విదేశీ కరెన్సీని తరలించేందుకు అవసరమైన నిబంధనలు పాటించారా లేదా అనే అంశంపై అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.

Shamshabad Airport: అక్రమ రవాణాపై నిఘా

శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం, విదేశీ కరెన్సీ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద ప్రయాణికులపై నిఘా ఉంచి తనిఖీలు చేపడుతున్నారు. తాజాగా భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడిన ఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది.

కోతుల భయంతో పరుగులు..గుండె ఆగి బాలుడి మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha