Delhi Crime: దక్షిణ ఢిల్లీలోని సంపన్న ప్రాంతమైన అమర్ కాలనీలో జరిగిన యూపీఎస్సీ అభ్యర్థిని హత్య కేసులో నిందితుడు రాహుల్ మీనా (23) ఎంతటి ప్రమాదకరమైన వ్యక్తో విచారణలో వెల్లడైంది.
కేవలం 12 గంటల వ్యవధిలోనే అతను రెండు రాష్ట్రాల్లో ఇద్దరు మహిళల జీవితాలను చిన్నాభిన్నం చేశాడు.
Read Also:Assembly Elections: అసెంబ్లీ ఎన్నికలు..పోలింగ్ సమయం పెంపుపై ఈసీకి విజయ్ విజ్ఞప్తి
Delhi Crime: క్రైమ్ టైమ్‌లైన్ (Time-line of Violence)
బుధవారం ఉదయం 6:39 – 7:30, తన మాజీ యజమాని ఇంటికి వెళ్లి, ఒంటరిగా ఉన్న యువతిని ఫోన్ ఛార్జర్ కేబుల్‌తో గొంతు నులిమి, ల్యాంప్‌తో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి, దోపిడీకి పాల్పడ్డాడు.మంగళవారం రాత్రి 10:30: అల్వార్‌లోని తన పొరుగున ఉండే మహిళ ఇంట్లోకి చొరబడి, ఆమె నోరు నొక్కి హింసించి అత్యాచారానికి పాల్పడ్డాడు. వెళ్లేటప్పుడు ఆమె భర్త, పిల్లలను చంపుతానని బెదిరించి పరారయ్యాడు.అల్వార్ నుంచి రాత్రే బయలుదేరి బుధవారం తెల్లవారుజామున 6:30 గంటలకు ఢిల్లీలోని అమర్ కాలనీకి చేరుకున్నాడు.
Rahul Meena Crime Sequence Alwar Delhi
నిందితుడిని యజమాని ఎందుకు తీసేశారు?
రాహుల్ మీనా గతంలో ఈ ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో ఏడాది పాటు పనిచేశాడు. అయితే, అతనికి ఉన్న బెట్టింగ్ (Betting) వ్యసనం వల్ల యజమానిని మోసం చేయడం ప్రారంభించాడు. మందుల కోసం డబ్బులు తీసుకుని, షాపుల్లో అప్పు పెట్టి ఆ డబ్బును బెట్టింగ్‌కు వాడేవాడు. ఈ విషయం తెలిసి యజమాని అతడిని పనిలో నుంచి తొలగించారు. ఈ కక్షతోనే, డబ్బు కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు.
పోలీసులు ఎలా పట్టుకున్నారు?
నిందితుడు పసుపు రంగు షర్ట్‌లో వెళ్లడం, తిరిగి వచ్చేటప్పుడు బాధితురాలి సోదరుడి బట్టలు మార్చుకుని తెల్లటి ప్యాంట్‌లో రావడాన్ని సిసిటివి కెమెరాలో రికార్డ్ అయ్యాయి..నిందితుడు ఎక్కిన ఆటోను గుర్తించిన పోలీసులు, డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో అతను దిగిన హోటల్‌పై దాడి చేసి బుధవారం రాత్రి అతడిని అరెస్ట్ చేశారు.ఈ కేసులో నిందితుడికి కఠిన శిక్ష పడేలా 15 ప్రత్యేక బృందాలు ఆధారాలను సేకరిస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
అసెంబ్లీ సమరం 2026: ఉదయం నుంచే క్యూలైన్లలో ఓటర్లు.. పోలింగ్ శాతం ఇలా!

