Kishan Reddy: లోక్‌సభలో కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన అమరావతి చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతికి తెలంగాణ బీజేపీ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి అభివృద్ధి పథంలో సాగాలని ఆయన ఆకాంక్షించారు.
బిల్లుపై చర్చ సందర్భంగా కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని గుర్తు చేశారు. సుదీర్ఘ పోరాటం తర్వాతే తెలంగాణ ఏర్పడిందని, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించుకున్నామని పేర్కొన్నారు. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో జై తెలంగాణ అన్నందుకు 369 మంది విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం కాల్చి చంపిందని ఆరోపించారు. మలిదశ ఉద్యమంలోనూ కాంగ్రెస్ జాప్యం వల్లే 1200 మంది విద్యార్థులు ఆత్మార్పణ చేసుకున్నారని ఆయన మండిపడ్డారు.
Read Also: Petrol Price Hike: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ
Telangana BJP supports Amaravati’s legalization.. Union Minister Kishan Reddy’s key speech in Lok Sabha
Kishan Reddy: విమానాశ్రయాల అభివృద్ధిపై విమర్శలు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఏడు విమానాశ్రయాలు అందుబాటులో ఉండగా, తెలంగాణలో కేవలం ఒకే ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయం ఉందని అన్నారు. తెలంగాణలో విమానయాన రంగం వెనుకబాటుకు గతంలోని కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలే కారణమని ఆయన ధ్వజమెత్తారు. విభజన జరిగిన పదేళ్ల తర్వాత కూడా అమరావతిని రాజధానిగా చెప్పుకోలేని పరిస్థితి రావడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పోటీతత్వంతో అభివృద్ధి కావాల్సి ఉందని అన్నారు. విభజన జరిగి పదేళ్లు దాటినా అమరావతిని రాజధానిగా చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బీజేపీ తరఫున అమరావతి చట్టబద్ధత బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

