CM Chandrababu on Amaravati Gazette: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడింది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ మేరకు అమరావతికి సంపూర్ణ చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటికే పార్లమెంట్‌లోని ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం తర్వాత ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. అప్పుడు రాష్ట్రపతి ఆమోదంతో ఏపీ రాజధాని అమరావతి కానుంది.ఈ చారిత్రక పరిణామంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
Read Also:Google Data Center : ఈ నెల 28న చంద్రబాబు శంకుస్థాపన
రాష్ట్రపతి ఆమోదంతో చట్టరూపం
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడంపై రాయలసీమ వాసుల కళ్లలో కనిపిస్తున్న ఆనందం…. రాష్ట్ర ప్రజల ఆశలకు, ఆలోచనలకు, ఆకాంక్షలకు ప్రతిరూపం. అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులతో ప్రతి పౌరుడు గర్వించేలా ప్రజా రాజధాని నిర్మిద్దాం! అని పేర్కొన్నారు.
ఈ బిల్లుకు మద్దతు పలికిన ఎంపీలు, రాష్ట్ర నాయకులు, ఉద్యమంలో అండగా నిలిచిన ప్రతి పౌరుడికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. “ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం, ముఖ్యంగా అమరావతి రైతుల విజయం” అని ఆయన తన పోస్టులో ఉద్ఘాటించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు.. కేంద్రం అధికారిక గెజిట్ విడుదల

