Dailyhunt
ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు.. కేంద్రం అధికారిక గెజిట్ విడుదల

ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు.. కేంద్రం అధికారిక గెజిట్ విడుదల

వార్త 3 weeks ago

Amaravati Capital Gazette: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న సందిగ్ధతకు శాశ్వత పరిష్కారం లభించింది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నిర్ణయంతో రాష్ట్ర అభివృద్ధి పథంలో ఒక కీలకమైన అడ్డంకి తొలగిపోయి, రాజధాని నిర్మాణానికి పూర్తిస్థాయి చట్టబద్ధత చేకూరినట్లయింది.

Read Also:Chandrababu Warning : అధికారులకు క్లాస్ పీకిన సీఎం చంద్రబాబు

Amaravati Capital Gazette: రాష్ట్రపతి ఆమోదంతో చట్టబద్ధత

అమరావతికి ఏకైక రాజధానిగా శాశ్వత హోదా కల్పించేందుకు ఉద్దేశించిన "ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) బిల్లు-2026"కు సర్వోన్నత ఆమోదం లభించింది.ఇప్పటికే పార్లమెంట్‌లోని ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం తర్వాత ఈ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. అప్పుడు రాష్ట్రపతి ఆమోదంతో ఏపీ రాజధాని అమరావతి కానుంది.

అయితే అమరావతి చట్టబద్దత బిల్లును ఏప్రిల్ 1, 2 తేదీల్లో పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. సుమారు 5 గంటల పాటు లోక్‌సభ, రాజ్యసభల్లో బిల్లుపై చర్చలు జరిగాయి. ఎలాంటి సవరణలు లేకుండానే బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అమరావతి చట్టబద్ధత బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో అమరావతి ప్రాంత ప్రజలు సంబరాలు జరుపుకున్నారు.

 Andhra Pradesh Reorganisation Amendment Bill

గెజిట్ నోటిఫికేషన్ ప్రధానాంశాలు

ప్రభుత్వం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌లో పలు కీలక అంశాలను పొందుపరిచింది:

నిర్మాణ పనులు: నిలిచిపోయిన ఐకానిక్ భవనాలు (సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ), మౌలిక సదుపాయాల కల్పన పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించేందుకు ఈ నోటిఫికేషన్ మార్గం సుగమం చేసింది.

ఏకైక రాజధాని: గతంలో చర్చకు వచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనను పక్కన పెట్టి, అమరావతిని పూర్తిస్థాయి పాలనా, శాసన, న్యాయ రాజధానిగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

భూ వినియోగం: రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) పరిధిలోని భూములను మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేసేందుకు గెజిట్ ద్వారా అనుమతులు మంజూరయ్యాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఈ నెల 28న చంద్రబాబు శంకుస్థాపన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha