Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష

వార్త 2 months ago

Amaravati Capital Construction: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా రాజధాని పనుల వేగాన్ని పెంచడంపై అధికారులకు, నిర్మాణ సంస్థలకు దిశానిర్దేశం చేశారు. రాజధాని నిర్మాణం అనేది కేవలం ఒక కాంట్రాక్ట్ పని కాదని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అని ఆయన స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని అధికారులను హెచ్చరించారు.

Read Also: Mamata Banerjee : 'మమతావేశం!

 Capital works must be completed within the deadline CM Chandrababu

Amaravati Capital Construction: వారం, నెల వారీ లక్ష్యాలతో పనుల వేగం

రాజధాని పనులను పరుగులు పెట్టించేందుకు వారం, నెల వారీగా నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సీఎం సూచించారు. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే పూర్తి చేయాల్సిన కీలక పనులపై అధికారులు ఆయనకు వివరణ ఇచ్చారు. నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైతే కార్మికుల సంఖ్య పెంచుకోవాలని, ఎక్కడా జాప్యం జరగకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

లైసెన్స్ లేకుండా పాల విక్రయాలు చేస్తే రూ.5 లక్షలు జరిమానా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha