Dailyhunt
అమరావతి రాజధాని గ్రామాల్లో రోడ్ల నిర్మాణం.. భూసేకరణపై సీఆర్‌డీఏ స్పష్టత

అమరావతి రాజధాని గ్రామాల్లో రోడ్ల నిర్మాణం.. భూసేకరణపై సీఆర్‌డీఏ స్పష్టత

వార్త 6 days ago

Amaravati: రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో రోడ్లు వేయాల్సిన చోట్ల భూముల సేకరణకు రెండు నెలలు గడువు ఇస్తున్నామని, అప్పట్లోపు రైతులు ముందుకు రాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని సీఆర్‌డీఏ కమిషనర్ విజయరామరాజు తెలిపారు.

మాస్టర్ ప్లానులో భాగంగా భూములు కోల్పోయే రైతులతో రాయపూడి కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. నెగోషియబుల్ పాలసీ ప్రకారం రైతులు సహకరించాలని, ఇప్పటికే దీనిపై నోటిఫికేషన్ ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.

Read also: Anantapur: ఆర్థిక నేరాలకు అడ్డాగా మారుతున్న కళ్యాణదుర్గం..?

 CRDA Commissioner meeting with farmers

Amaravati: గ్రామ కంఠాల సమస్యపై 15 రోజుల్లో ప్రకటన

గ్రామ కంఠాల సమస్యపై 15 రోజుల్లో సవివరమైన ప్రకటన చేస్తామని కమిషనర్ రైతులకు హామీ ఇచ్చారు. ఇప్పటికే సర్వే పూర్తయిందని, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో నివేదిక తయారు చేస్తున్నామని తెలిపారు. ఏ పొలంలో రోడ్డు పోతోంది, గ్రామంలో ఎంత భూమి పోతోందనే అంశాలపై సమగ్ర ప్లానును ఆయా గ్రామాలకు పంపిస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అంశాలను సమీక్షించి, సీఆర్‌డీఏ చట్టం ప్రకారం తదుపరి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

రైతులకు కౌలు నగదు

అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఈ ఏడాది కౌలు నగదు జమ చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. అయితే, ఆధార్ ఇనాక్టివ్ ఉన్న 4,528 బ్యాంక్ ఖాతాలలో నగదు జమ చేయడం సాధ్యపడదని అధికారులు తెలిపారు. సంబంధిత రైతులు వెంటనే తమ ఖాతాలను యాక్టివేట్ చేసుకోవాలని సీఆర్‌డీఏ సూచించింది. ఆయా బ్యాంక్ ఖాతాల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచినట్లు, రైతులు వెంటనే తనిఖీ చేసుకోవాలని అధికారులు గమనిక జారీ చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

పోలీసు కస్టడీలో అనంతబాబు విచారణ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha