Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పోలీసు కస్టడీలో అనంతబాబు విచారణ

పోలీసు కస్టడీలో అనంతబాబు విచారణ

వార్త 1 month ago

Anantha Babu MLC: దళిత యువకుడు, కారు డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైఎస్సార్సీ ఎమ్మెల్సీ అనంతబాబును మంగళవారం కాకినాడ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు.

సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై నమోదైన కేసులో భాగంగా ఈ విచారణ జరిపారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న అనంతబాబును కోర్టు అనుమతితో పోలీసులు భారీ భద్రత నడుమ రాజమండ్రి నుండి కాకినాడ రూరల్ పరిధిలోని సర్పవరం పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు.

Read also: Anantapur crime: అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు: 10 మంది అరెస్ట్

 Police inquiry of MLC Anantha Babu

Anantha Babu MLC: కీలక ఆధారాల సేకరణ

సాక్షులను బెదిరించడం, ఆధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారనే అభియోగాలపై లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు కోర్టును కోరారు. దీనికి స్పందించిన మొబైల్ కోర్టు అనంతబాబును 24 గంటల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు ఆధ్వర్యంలో అనంతబాబు విచారణ జరిగింది. సాక్షులకు ఫోన్ చేసి బెదిరించినట్లు వచ్చిన ఆరోపణలపై పోలీసులు ఆయనను ప్రశ్నించారు. ఇప్పటికే ఆయన ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్ డేటా ఆధారంగా కీలక ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. కస్టడీ ముగిసిన అనంతరం జైలుకు తరలించారు. బుధవారం తిరిగి ఆయనను కోర్టులో ప్రవేశపెట్టి రాజమహేంద్రవరం జైలుకు తరలించనున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి రిమాండ్ పొడిగింపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha