MLA Amilineni: ఆంధ్రుల ఎన్నో సంవత్సరాల కల అయిన రాజధాని అమరావతికి పార్లమెంట్‌లో చట్టబద్ధ ఆమోదం లభించడం ఎంతో సంతోషకరమైన విషయమని ఎమ్మెల్యే అమిలినేని తెలిపారు.
అమరావతి రాజధాని కల కేవలం కలగానే మిగిలిపోకుండా చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు.
Read Also: Ghantasala statue tribute: తిరుపతిలో ఘంటసాల స్మరణ.. ప్రతి నెల నివాళి కార్యక్రమం
MLA Amilineni: రాష్ట్ర చరిత్రలో ప్రత్యేకమైన రోజు
దాదాపు ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రాజధానికి నేడు చట్టబద్ధత లభించడం రాష్ట్ర చరిత్రలో ప్రత్యేకమైన రోజుగా నిలిచిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తును బలోపేతం చేసే బాధ్యతను తీసుకున్నారని తెలిపారు. ఈ సంతోషకరమైన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజలు సంక్రాంతి, ఉగాది, రంజాన్ పండుగల లాగా ఉత్సాహంగా ఆనందంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :
ఎన్టీఆర్ స్ఫూర్తితో రాష్ట్రంలో పెన్షన్ల పండుగ.. ఎమ్మెల్యే సురేంద్రబాబు

