Dailyhunt
అమరావతికి పార్లమెంట్ చట్టం.. సీఎం చంద్రబాబు హర్షం!

అమరావతికి పార్లమెంట్ చట్టం.. సీఎం చంద్రబాబు హర్షం!

వార్త 2 weeks ago

Parliament Act for Amaravati: అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో తిరుగులేని శాసనం చేశారని, ఇది ప్రజా సంకల్పానికి దక్కిన గౌరవమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

అమరావతి బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెం వద్ద గురువారం రైతులతో కలిసి సతీ సమేతంగా అమరావతికి దీపహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

Read Also: Polavaram Diaphragm : 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి

దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ విజయం

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. “అమరావతి విజయం దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగింది. 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చి చేసిన త్యాగం, 1,631 రోజుల పోరాటం వల్లే ఈ విజయం సాధ్యమైంది. రాజధానిని స్మశానం అన్న వారు నేడు అడ్రస్ లేకుండా పోయారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి అడ్రస్ లేదు, కానీ నేడు ఒక శాశ్వత అడ్రస్ వచ్చింది. అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిహ్నం” అని పేర్కొన్నారు.

Parliament Act for Amaravati: ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్న సీఎం

నాడు ముళ్ల కంచెలు దాటుకుని ఉద్యమం చేస్తున్న రైతుల వద్దకు పవన్ కళ్యాణ్ రావడం, భువనేశ్వరి తన గాజులను విరాళంగా ఇవ్వడం, తాను జోలె పట్టి నిధులు సేకరించడం వంటి ఘటనలను సీఎం గుర్తుచేసుకున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రైతులు సింహాల్లా దూకారని కొనియాడారు.

ప్రధాని మోదీకి ధన్యవాదాలు

“ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు, బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు. ప్రపంచ స్థాయి నగరాన్ని ఇక్కడ నిర్మిస్తాం. ఒక ప్రాజెక్టుకు ప్రధాని రెండు సార్లు రావడం అమరావతి విషయంలోనే జరిగింది, ప్రారంభోత్సవానికి కూడా ఆయనే వస్తారు” అని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

Parliament Act for Amaravati: వైసీపీ తీరుపై ఆగ్రహం

అమరావతిని చంపాలనుకున్న వైసీపీ బాగుపడదని చంద్రబాబు మండిపడ్డారు. పార్లమెంటులో చట్టం చేస్తుంటే వాకౌట్ చేసిన ఆ పార్టీని ప్రజలు బ్లాక్ అవుట్ చేయాలని పిలుపునిచ్చారు. “మావిగన్” అంటూ రాజధానిపై అపహాస్యం చేయడం దుర్మార్గపు ఆలోచన అని మండిపడ్డారు.

శంకుస్థాపన స్థలంలో ప్రత్యేక పూజలు

అనంతరం ముఖ్యమంత్రి కూటమి నేతలతో కలిసి శంకుస్థాపన శిలాఫలకాన్ని పరిశీలించారు. పవిత్ర మట్టి, జలాలు ఉన్న వేదిక వద్ద వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి, రాజధాని భూమికి సాష్టాంగ ప్రణామం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, పి. నారాయణ, అచ్చెన్నాయుడు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఏపీకి కొత్త శకం ప్రారంభమైందని సీఎం వ్యాఖ్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha