Dailyhunt
ఏపీకి కొత్త శకం ప్రారంభమైందని సీఎం వ్యాఖ్య

ఏపీకి కొత్త శకం ప్రారంభమైందని సీఎం వ్యాఖ్య

వార్త 2 weeks ago

Amaravati Capital Bill : రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక కీలక ఘట్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

అమరావతి ఇప్పుడు రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా చట్టబద్ధమైన గుర్తింపు పొందిందని ఆయన తెలిపారు. ఈ విషయంపై ఆయన సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో స్పందిస్తూ, రాష్ట్రానికి కొత్త శకం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. అమరావతి ఇక తిరుగులేని రాజధానిగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

చారిత్రక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026 పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందడం ప్రజల సమిష్టి ఆకాంక్షలకు న్యాయం చేసినట్లేనని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ అనేక సమస్యలు ఎదుర్కొన్నదని ఆయన గుర్తుచేశారు. ఈ సమయంలో అమరావతి రైతులు చేసిన త్యాగం ఎంతో గొప్పదని పేర్కొన్నారు.

రైతులకు అంకితం

అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల విశ్వాసం, ధైర్యమే ఈ ప్రాజెక్టును నిలబెట్టిందని చంద్రబాబు అన్నారు. ఈ చారిత్రక విజయాన్ని వారికి అంకితం చేస్తున్నానని తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రానికి దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న స్థిరత్వం లభించిందని, ప్రజలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

కేంద్రానికి కృతజ్ఞతలు

రాష్ట్ర ఆకాంక్షలకు మద్దతు ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చంద్రబాబు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా కేంద్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. అమరావతిని ఏకైక ప్రజా రాజధానిగా మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు, పార్లమెంట్ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Read Also:Medchal Doctor Suicide: భార్య వేధింపులు భరించలేక..డాక్టర్ ఆత్మహత్య

రాజ్యసభలో ఆమోదం

గురువారం రాజ్యసభలో ఈ బిల్లును మూజువాణి ఓటుతో (Amaravati Capital Bill ) ఆమోదించినట్లు సభాధ్యక్షులు సి.పి. రాధాకృష్ణన్ ప్రకటించారు. దీంతో అమరావతి అధికారికంగా ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక, శాశ్వత రాజధానిగా చట్టబద్ధ గుర్తింపు పొందింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిణామాలకు నాంది పలికినట్లైంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

బస్సు ప్రమాదం: 14 మంది మృతికి ఆ 'పిసినారితనమే' కారణం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha