Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాకినాడ కలెక్టరేట్ ఉద్యోగి ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.8 కోట్లకు పైగా అక్రమాస్తులు

కాకినాడ కలెక్టరేట్ ఉద్యోగి ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.8 కోట్లకు పైగా అక్రమాస్తులు

వార్త 1 week ago

Kakinada ACB Raids: కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఒక ఉద్యోగి నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విరుచుకుపడ్డారు.

ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే నమ్మదగిన సమాచారంతో చోడపురెడ్డి శివరామ్ కుమార్ (36) ఇల్లు, ఆయన బంధువుల నివాసాల్లో శుక్రవారం ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో కోట్లాది రూపాయల విలువైన అక్రమ సంపాదన వెలుగుచూడటం స్థానికంగా కలకలం రేపింది.

 Chodapureddu Shivaram Kumar ACB Raids

Read also: Chandrababu Naidu: విశాఖను 'బే సిటీ'గా మార్చడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

ఏకకాలంలో పలుచోట్ల సోదాలు

రాజమహేంద్రవరం రేంజ్ ఏసీబీ అడిషనల్ ఎస్పీ కిషోర్ కుమార్ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. కాకినాడలోని శివకుమార్ నివాసంతో పాటు, ఆయన మామ చింతల శ్రీనివాసన్ ఇల్లు, చీడిగ ప్రాంతంలోని ఆయన సోదరి నాగిష్ సుష్మ ఫ్లాట్‌లో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. వీటితో పాటు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆయన ఆస్తులపై, కాకినాడ కలెక్టరేట్ ప్రాంగణంలోని ఆయన ఆఫీసు గదిలోనూ ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించాయి.

Kakinada ACB Raids: దొరికిన ఆస్తుల వివరాలు:

ప్రాథమిక దర్యాప్తు మరియు తనిఖీల ప్రకారం సుమారు రూ.8 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న వాటిలో 700 గ్రాముల బంగారు ఆభరణాలు, కాకినాడ, హైదరాబాద్ నగరాల్లో సుమారు రూ.4 కోట్ల విలువైన మూడు లగ్జరీ ఫ్లాట్లు, మూడు విలాసవంతమైన కార్లు, పలు ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ భూములకు సంబంధించిన కీలక పత్రాలు.

అదనపు బాధ్యతల్లో ఉంటూ చేతివాటం!

శివకుమార్ కలెక్టరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూనే.. మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్ఐ)గా, కలెక్టరేట్ రికార్డ్ రూమ్ ఇన్‌చార్జిగా కూడా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, శుక్రవారం అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగించారు. పట్టుబడిన ఆస్తుల అసలు మార్కెట్ విలువ, ఇతర లావాదేవీలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

రాజ్యసభ అభ్యర్థులు వీరేనా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha