Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం.. ట్రంప్‌కు ప్రధాని మోదీ అభినందనలు

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం.. ట్రంప్‌కు ప్రధాని మోదీ అభినందనలు

వార్త 3 weeks ago

Modi Wishes To Trump: అమెరికా సంయుక్త రాష్ట్రాలు (USA) తమ చారిత్రాత్మక 250వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రజలకు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

140 కోట్ల మంది భారత ప్రజల తరఫున అమెరికా సాధించిన ఈ అపూర్వ మైలురాయికి శుభాకాంక్షలు చెబుతూ శనివారం ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు.

Read also: Thailand travel rules: బ్యాంకాక్ యాత్రికులకు బిగ్ అలర్ట్.. కొత్త వీసా రూల్స్ ఇవే!

ఉమ్మడి విలువలతో బలపడిన భారత్-అమెరికా బంధం

భారత్, అమెరికాల మధ్య సంబంధాలు కేవలం వ్యూహాత్మక ప్రయోజనాలకే పరిమితం కాలేదని, అంతకుమించిన లోతైన బంధం ఇరు దేశాల మధ్య ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య సూత్రాలు, చట్టబద్ధమైన పాలన వంటి ఉమ్మడి విలువల పునాదులపైనే ఈ స్నేహం నిర్మితమైందని ఆయన కొనియాడారు. రెండు దేశాల ప్రజల నైపుణ్యాలు, మేధోసంపత్తి ఈ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తున్నాయని, ఈ బంధం ప్రపంచ శాంతికి, శ్రేయస్సుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. రాబోయే 250 ఏళ్లలో అమెరికా మరింత పురోగతి సాధించాలని, ఇరు దేశాల సెంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరాలని మోదీ ఆకాంక్షించారు.

Modi Wishes To Trump: యూఎస్ వేడుకల్లో భారత్‌కు చెందిన ‘ఐఎన్ఎస్ సుదర్శిని’

అమెరికా మైలురాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ నౌకల ప్రదర్శన ‘SAIL4th 250’లో భారత నౌకాదళానికి చెందిన ‘ఐఎన్ఎస్ సుదర్శిని’ (INS Sudarshini) పాల్గొనడం విశేషం. న్యూయార్క్, బోస్టన్ నగరాల్లో జరిగే ఈ ప్రత్యేక ప్రదర్శనలో మన నౌక భాగస్వామి కానుంది. ఇప్పటికే వర్జీనియాలో జరిగిన కార్యక్రమాలను ముగించుకుని, ప్రస్తుతం బాల్టిమోర్ చేరుకున్న ఈ నౌక ఇరు దేశాల మధ్య ఉన్న సముద్ర రక్షణ సంబంధాలకు ప్రతీకగా నిలుస్తోంది. మరోవైపు న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా అమెరికాకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, స్వేచ్ఛా సమాజాల పట్ల తమ నిబద్ధతను చాటుకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha