Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికా నిర్ణయంతో భారత్ కంపెనీలకు భారీ నష్టం

అమెరికా నిర్ణయంతో భారత్ కంపెనీలకు భారీ నష్టం

వార్త 1 week ago

H-1B Visa : అమెరికా ప్రభుత్వం విదేశీయుల పట్ల దారుణంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా అక్కడ పని చేస్తున్న విదేశీ ఉద్యోగులు ఆందోళనతో ఉన్నారు. అక్కడి ప్రభుత్వం హెచ్ 1బీ వీసాలపై తీవ్ర ఆంక్షలు విధించింది.

పలు కంపెనీలకు చర్యలు తీసుకుంది. భారత్ కంపెనీలే కాకుండా స్థానిక కంపెనీలపై అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ పై కూడా చర్యలు తీసుకున్నారు. దీనిపై మైక్రోసాఫ్ట్ కూడా స్పందించింది. తాజాగా ఆ దేశ ప్రభుత్వ నిర్ణయంపై మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ కూడా మాట్లాడారు. గ్రీన్ కార్డుల విషయంలో అమెరికా తీసుకున్న నిర్ణయంపై ఆయన ఆందోళనను వ్యక్తం చేశారు. విదేశీ ఉద్యోగులకు అమెరికాలో శాశ్వతంగా స్థిరపడే అవకాశాలను తగ్గిస్తే.. భవిష్యత్తులో టెక్నాలజీ రంగం నష్టపోయే ప్రమాదం ఉందని గుర్తు చేశారు.

Saudi Arabia Attacks : 'సౌదీపై దాడులు వెంటనే ఆపాలి' అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక

 H-1B Visa

H-1B Visa : వాన్స్ ఆరోపణలను ఖండించిన

అమెరికాలోని టెక్ కంపెనీలు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ప్రతిభావంతులైన ఉద్యోగులను నియమించుకుంటాయని.. ప్రభుత్వం నిర్ణయం వల్ల వారంతా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. అమెరికా కంపెనీలు నైపుణ్యం గల ఉద్యోగులను కోల్పోవాల్సి వస్తుందని బ్రాడ్ ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రో సాఫ్ట్ కంపెనీ హెచ్ 1బీ వీసాలను దుర్పినియోగం చేసిందని యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆరోపణలపై కూడా బ్రాడ్ స్మిత్ స్పందించారు. వాన్స్ ఆరోపణలను ఖండించారు. తమ కంపెనీ విదేశీ ఉద్యోగులకు తక్కువ జీతాలు ఇస్తుందనే వాదనను కూడా ఆయన ఖండించారు. ఉద్యోగి ఏ దేశానికి చెందినవారైనా వారి ఇమ్మిగ్రేషన్ స్థితితో సంబంధం లేకుండా ఒకే విధమైన వేతన వ్యవస్థను అనుసరిస్తామని స్పష్టం చేశారు.

హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత.. సముద్రంలో మునిగిన సింగపూర్ నౌక

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha