NRI Farmer Protest Sangareddy: అమెరికా నుంచి పరుగెత్తుకొచ్చిన రైతు… జిన్నారంలో భూ హక్కుల కోసం దీక్ష. 14 గుంటల భూమి మరొకరి పేరుకు.. ఐదు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతు.
గ్రీన్ కార్డు గడువు సమీపిస్తున్నా న్యాయం లేకపోవడంతో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. జిన్నారం మండల కేంద్రంలో అమెరికాలో స్థిరపడిన ఓ రైతు తన స్వగ్రామ భూమి కోసం స్వదేశానికి పరుగెత్తుకొచ్చి, ఐదు నెలలుగా అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం దక్కకపోవడంతో చివరకు తహశీల్దార్ కార్యాలయం ఎదుటే దీక్షకు దిగారు, మండల పరిధిలోని శివనగర్ గ్రామానికి చెందిన రైతు రవి శంకర్‌కు చెందిన సర్వే నంబర్ 172లోని 14 గుంటల పట్టా భూమిని సంబంధం లేని వ్యక్తి పేరుపై రెవెన్యూ అధికారులు మార్చారు, ఈ విషయం తెలుసుకున్న రవి శంకర్ అమెరికా నుంచి హుటాహుటిన స్వగ్రామానికి చేరుకుని, గత ఐదు నెలలుగా రెవెన్యూ అధికారులను కలిసి తన భూమి హక్కుల కోసం పోరాడుతున్నారు. అయితే ఎవరూ తన సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా, ఆధారాలు చూపించినా అధికారులు స్పందించలేదని ఆరోపించారు.
Read Also :Sangareddy: సదాశివపేటలో భక్తిశ్రద్ధలతో శని అమావాస్య వేడుకలు

NRI Farmer Protest Sangareddy: ఈ నేపథ్యంలో శుక్రవారం జిన్నారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతు రవి శంకర్(82) ధర్నాకు దిగారు. "నా భూమిని తిరిగి నా పేరుపై నమోదు చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది అంటూ స్పష్టం చేశారు. మరోవైపు జూన్ మొదటి వారంతో తన అమెరికా గ్రీన్ కార్డు గడువు ముగియనుందని, తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ న్యాయం కోసం ఇక్కడే ఉండాల్సి వస్తోందని కన్నీటి పర్యంతమయ్యారు. రైతు చేస్తున్న దీక్షకు స్థానికులు, రైతు సంఘాల నాయకులు మద్దతు తెలుపుతున్నారు. రెవెన్యూ శాఖ నిర్లక్ష్యంపై మండిపడుతూ, వెంటనే విచారణ జరిపి బాధిత రైతుకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

