Sangareddy:విశేషమైన విశిష్టత గల రోజు 16వ తేదీ శనివారం… మామూలుగా అయితే ప్రతి అమావాస్యనాడు పరమశివుడిని భక్తితో ఆరాధిస్తారు. కానీ ఈ 16వ తేదీ నాడు వచ్చిన అమావాస్యకు చాలా విశిష్టత ఉంది.
సమస్త లోకాలు ఎవరికి అయితే భయపడతారో ఆ మహా శనీశ్వరుడి జయంతి ఈ శనివారం నాడు వచ్చింది. మామూలుగా అయితే కూడా శనివారం నాడు నవగ్రహాలకు పూజలు చేస్తారు. శని బాధలు ఉండకూడదని ఆ శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తారు. అది అమావాస్యనాడు శనివారం కలిసి వస్తే ఆ రోజు శనీశ్వరుడికి ఇష్టమైన రోజుగా భావించి ప్రత్యేకంగా పూజలు చేస్తారు.
Read Also:Gummadidala News: రూ.15 కోట్ల అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన

కానీ ఈ 16వ తేదీనాడు వచ్చిన అమావాస్య మూడు విశిష్టతలతో కూడుకున్నది. శనీశ్వరుడికి ఇష్టమైన శనివారం అందులో అమావాస్య ఆపై అతని జయంతి.. ఇంకేముంది అన్ని రకాలు కలిసి వచ్చిన ఈ రోజును భక్తులు వదులుకుంటారా.. శనీశ్వర ఆలయం ఎక్కడ ఉందా అని వెతుక్కుంటూ పరుగులు పెడతారు.. అంతేకాకుండా అమావాస్యనాడు మహాశివుడికి పంచామృతాలతో అభిషేకం చేసి నైవేద్యములు సమర్పిస్తే అంతా మంచి జరుగుతుందనే నమ్మకం ఆయన భక్తులలో ఉంటుంది. ఇది అలా ఉంచితే సదాశివపేటలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో అమావాస్యను పురస్కరించుకొని భక్తులు ఘనంగా అభిషేకాలు పూజలు చేశారు. 1983 84 సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల మిత్రబృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ మహా పూజ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు కిష్టయ్య దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
Sangareddy: బసవరాజు స్వామి నేతృత్వంలో జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరైనారు. మంగళ హారతులు అనంతరం వచ్చిన భక్తులకు అన్న ప్రసాదం గావించారు. మల్లికార్జున స్వామిని దర్శించడానికి సదాశివపేట మాజీ మున్సిపల్ చైర్మన్- ప్రస్తుత కో ఆప్షన్ సభ్యుడు సత్యనారాయణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింత గోపాల్ , అశోక్, మున్సిపల్ మేనేజర్,శానిటరీ ఇన్స్పెక్టర్ ఇంకా చాలామంది భక్తులు రాగా ఈ కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థుల మిత్రబృందం అధ్యక్షుడు గంట శివయ్య ఆధ్వర్యంలోని మిత్రులు శంకర్ గౌడ్, పృథ్వీరాజ్, శ్రీనివాస్ రెడ్డి, కొండల్, వెంకట్రావు,జనార్ధన్, సంగమేశ్వర్, నందు, రవి, ప్రమోద్ పటేల్, కందికృష్ణ, రజనీకాంత్, రవి టీచర్ పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

