Dailyhunt
అమెరికా సైనికులు వస్తే నిప్పుల వర్షం కురిపిస్తాం: ఇరాన్

అమెరికా సైనికులు వస్తే నిప్పుల వర్షం కురిపిస్తాం: ఇరాన్

వార్త 2 weeks ago

ధ్య ప్రాచ్యంలోకి మరో 3,500 అమెరికా బలగాలు చేరుకున్నాయనే వార్తలు వినిపిస్తున్న వేళ 'అమెరికా సైనికుల కోసం తమ బలగాలు కాచుకుని ఉన్నాయి' అని ఇరాన్ (Iran) పార్లమెంట్ స్పీకర్ హెచ్చరించారు.

ఇరాన్ భూభాగంలోకి అమెరికా బలగాలు అడుగుపెట్టాలని ప్రయత్నిస్తే… ఇరాన్ “నిప్పుల వర్షం” కురిపిస్తుందని మొహమ్మద్ బగారే గాలిబఫ్ అన్నారు. కొత్తగా అక్కడకి చేరుకున్న సెయిలర్లు, మెరైన్లు… అమెరికా(America) యుద్ధనౌక యూఎస్ఎస్ ట్రిపోలీ యూనిట‍్‌వని యూఎస్ సెంట్రల్ కమాండ్ ‘ఎక్స్’లో తెలిపింది. ఇందులో దాడి చేయడానికి, రవాణాకు ఉపయోగపడే వనరులు ఉన్నాయని పేర్కొంది. ఇరాన్‌లో కొన్నివారాల భూతల దాడుల కోసం పెంటగాన్ సిద్ధమవుతోందని వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ చేసిన క్రమంలో ఈ బలగాలు అక్కడికి చేరుకున్నాయి. అయితే, భూతల దాడుల కోసమే బలగాలను మోహరించారా అనే విషయాన్ని అమెరికా అధికారులు ధ్రువీకరించలేదు. “శత్రువు బహిరంగంగా చర్చల సంకేతాలు పంపిస్తారు. మరోవైపు రహస్యంగా భూతల దాడుల కోసం ప్రణాళికలు రచిస్తారు” అంటూ గాలిబఫ్ వ్యాఖ్యానించినట్టు ఇరాన్‌ అధికారిక మీడియాలో కథనాలు వచ్చాయి.

Read Also: Nellore Crime: కొడవలూరులో జంట హత్యలు.. ప్రేమ వ్యవహారమే కారణమా..?

 Iran-USA War

Iran-USA War: ముగింపు దరిదాపుల్లోకి యుద్ధం: ట్రంప్

ఆ మధ్య యుద్ధం ముగింపు దరిదాపుల్లోకి వచ్చిందని ట్రంప్ చెప్పారు. అలాగే ఇంధనం సహా ఇరాన్‌పై ఇంకేమైనా చర్యలు తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. ఇలా ఆయన రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. గత వారం ప్రారంభంలో, ఇరాన్‌లో మిలటరీ ఆపరేషన్ కోసం కాంగ్రెస్‌ను 200 బిలియన్ డాలర్లు (సుమారు రూ.19 లక్షల కోట్లు) ఇవ్వాలని కోరేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమవుతోందని యూఎస్ మీడియా రిపోర్ట్ చేసింది. ట్రంప్ యుద్ధాన్ని కొనసాగించాలనుకుంటారని ఈ వార్తలు సూచిస్తున్నాయి. అంతకుముందు వారం ఓవల్ ఆఫీసులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తాను ఇరాన్‌లోకి సైనిక బలగాలను పంపడం లేదన్నారు. “ఒకవేళ పంపేట్టయితే కచ్చితంగా మీకు చెప్పను” అని కూడా అన్నారు. మరోవైపు, భూతల సైనిక బలగాల అవసరం లేకుండానే అమెరికా తమ యుద్ధ లక్ష్యాలను సాధించగలదని విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

చైనా కెమెరాలకు భారత్ చెక్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha