Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికా సైన్యంలో సంచలనం

అమెరికా సైన్యంలో సంచలనం

వార్త 2 months ago

Army chief news : యునైటెడ్ స్టేట్స్ సైన్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. యూఎస్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ Randy Georgeను వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ నిర్ణయాన్ని అమెరికా రక్షణ శాఖ ధ్రువీకరించింది. ప్రస్తుతం అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

పెంటగాన్ నిర్ణయం

అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ఆదేశాల మేరకు జనరల్ రాండీ జార్జ్ వెంటనే పదవీ విరమణ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఆయనను అర్ధాంతరంగా తొలగించడానికి గల ఖచ్చితమైన కారణాలను పెంటగాన్ వెల్లడించలేదు. సాధారణంగా ఆర్మీ చీఫ్ పదవీకాలం నాలుగేళ్లు ఉంటుంది. కానీ 2023లో బాధ్యతలు స్వీకరించిన రాండీ జార్జ్ కేవలం పదెనిమిది నెలలకే పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది.

సైన్యంలో వరుస మార్పులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలకు అనుగుణంగా సైన్యంలో కొత్త నాయకత్వం ఉండాలని రక్షణ శాఖ భావిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. రక్షణ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పీట్ హెగ్‌సెత్ ఇప్పటివరకు పలు ఉన్నతాధికారులను పదవుల నుంచి తప్పించారు.

Read Also:Medchal Doctor Suicide: భార్య వేధింపులు భరించలేక..డాక్టర్ ఆత్మహత్య

 Army chief news

కొత్త తాత్కాలిక చీఫ్

రాండీ జార్జ్ స్థానంలో ఆర్మీ వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ క్రిస్టోఫర్ లానెవ్ తాత్కాలిక చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధాల్లో అనుభవం ఉన్న జార్జ్‌ను ఇలా తొలగించడం అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

విజయ్ నామినేషన్ ర్యాలీలో అపశృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha