Dailyhunt
విజయ్ నామినేషన్ ర్యాలీలో అపశృతి

విజయ్ నామినేషన్ ర్యాలీలో అపశృతి

వార్త 2 weeks ago

Vijay tvk nomination : టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన నామినేషన్ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన ఆయన కాన్వాయ్‌ను అభిమానులు భారీగా చుట్టుముట్టడంతో ఈ ఘటన జరిగింది.

ఈ క్రమంలో పార్టీ నేత అర్జున్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఒక పోలీసు అధికారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ పోలీసు అధికారి గాయపడగా, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అభిమానుల రద్దీతో ఉద్రిక్తత

విజయ్ నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన సందర్భంగా అభిమానులు భారీగా తరలివచ్చారు. కాన్వాయ్ చుట్టూ పెద్ద ఎత్తున జనసందోహం ఏర్పడటంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. ఈ సమయంలోనే కారు ఢీకొట్టిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు కలకలం రేగింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని ర్యాలీని కొనసాగించారు.

Read Also:Medchal Doctor Suicide: భార్య వేధింపులు భరించలేక..డాక్టర్ ఆత్మహత్య

భద్రతా ఏర్పాట్లపై విమర్శలు

గతంలో కరూర్‌లో జరిగిన సభలో తొక్కిసలాట (Vijay tvk nomination) కారణంగా 40 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటన ఇంకా పూర్తిగా మరిచిపోకముందే ఇప్పుడు మళ్లీ ఈ ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. అప్పటి ఘటనపై విచారణ కూడా కొనసాగుతోంది. విజయ్ కూడా ఆ కేసుకు సంబంధించి పలుమార్లు విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విజయ్ నిర్వహించే సభలకు భారీగా అభిమానులు తరలివస్తున్నారు. అయితే జనసందోహాన్ని నియంత్రించడంలో పార్టీ వాలంటీర్లు, భద్రతా సిబ్బంది విఫలమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన భద్రతా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

బస్సు ప్రమాదం: 14 మంది మృతికి ఆ 'పిసినారితనమే' కారణం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha