Operation Checkmate: అమెరికాలో అక్రమంగా నివసిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య ట్రక్కులు (Commercial Trucks) నడుపుతున్న విదేశీయులను లక్ష్యంగా చేసుకుని యూఎస్ బోర్డర్ పెట్రోల్ అధికారులు నిర్వహించిన 'ఆపరేషన్ చెక్‌మేట్'సంచలనం సృష్టిస్తోంది.
ఈ ప్రత్యేక ఫెడరల్ ఆపరేషన్‌లో భాగంగా అరెస్టయిన వారిలో అత్యధికంగా 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లు ఉండటం గమనార్హం.
Operation Checkmate: ఆరిజోనా 'యుమా సెక్టార్' లో మెరుపు దాడులు
Operation Checkmate Arizona US Border Patrol Arrest Indian Truck Drivers Illegal Immigrants Yuma Sector Deportation
అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారిక ప్రకటన ప్రకారం.. ఆరిజోనా రాష్ట్రంలోని యుమా సెక్టార్ (Yuma Sector) పరిధిలో మే 11 నుండి మే 15వ తేదీల మధ్య ఈ ఆపరేషన్ చెక్‌మేట్ నిర్వహించారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న మొత్తం 52 మందిని అధికారులు ఈ ఆపరేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. వీరిని క్షుణ్ణంగా విచారించగా, అందులో 36 మంది భారీ సెమీ-ట్రక్కులను (Semi-trucks) నడుపుతున్న కమర్షియల్ డ్రైవర్లుగా గుర్తించారు.
30 మంది భారతీయులే.. బైడెన్ కాలం నాటి పత్రాలతో గుట్టురట్టు
అరెస్టయిన 36 మంది కమర్షియల్ ట్రక్ డ్రైవర్లలో ఏకంగా 30 మంది భారతీయ పౌరులు కాగా, మిగిలిన ఆరుగురు మెక్సికో, ఎల్ సాల్వడార్, మరియు రష్యా దేశాలకు చెందిన వలసదారులుగా అధికారులు నిర్ధారించారు. అధికారుల పరిశోధనలో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల్లో చాలా మంది గత జో బైడెన్ పరిపాలన కాలంలో పొందిన ఉపాధి అనుమతి పత్రాలను (Employment Authorization Documents – EAD) చూపిస్తున్నారు. అయితే, ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆ పత్రాల గడువు ముగిసిపోయింది, అవి ఇప్పుడు చెల్లవు (Invalid). వీరంతా కాలిఫోర్నియా, న్యూయార్క్, వాషింగ్టన్, వర్జీనియా వంటి వివిధ అమెరికన్ రాష్ట్రాల నుండి కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు (CDL) పొందారు. కొందరికి అసలు ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని అధికారులు తెలిపారు.
కఠిన చర్యలకు కారణం.. వరుస రోడ్డు ప్రమాదాలు
గత కొన్ని నెలలుగా అమెరికా రహదారులపై భారతీయ సంతతికి చెందిన అక్రమ వలస డ్రైవర్ల వల్ల పలు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. డ్రగ్స్ సేవించి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి కొందరు చేసిన ప్రమాదాల్లో అమెరికన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం రోడ్డు భద్రతను పటిష్టం చేయడానికి, అర్హత లేని విదేశీయులకు కమర్షియల్ లైసెన్సులు రాకుండా కట్టడి చేయడానికి ఈ రకమైన ప్రత్యేక డ్రైవ్‌లను చేపట్టింది. ప్రస్తుతం అరెస్టయిన 52 మందిపై అమెరికా ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు. వీరందరినీ అతి త్వరలోనే భారత్‌తో పాటు ఆయా స్వదేశాలకు డిపోర్ట్ (బహిష్కరణ) చేయనున్నట్లు యుమా సెక్టార్ యాక్టింగ్ చీఫ్ పెట్రోల్ ఏజెంట్ డస్టిన్ కాడిల్ స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

