Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికాలో అదృశ్యమైన పదిమంది శాస్త్రవేత్తల కలకలం

అమెరికాలో అదృశ్యమైన పదిమంది శాస్త్రవేత్తల కలకలం

వార్త 2 months ago

గ్రరాజ్యం అమెరికాలో అత్యంత రహస్యమైన అణు, అంతరిక్ష పరిశోధనల్లో నిమగ్నమైన 10 మంది శాస్త్రవేత్తలు అదృశ్యం కావడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారింది.

ఇది కేవలం కిడ్నాప్ వ్యవహారం మాత్రమే కాదు, దేశాల మధ్య సాగుతున్న ‘మేధో యుద్ధం’ (Intellectual War) అని విశ్లేషకులు భావిస్తున్నారు. అదృశ్యమైన పదిమంది శాస్త్రవేత్తలు సాధారణ పరిశోధకులు కారు. వీరు అమెరికా రక్షణ వ్యవస్థలో కీలకమైన విభాగాలకు చెందినవారు.

Read Also: Iran-USA War: రష్యా శాంతి ప్రణాళిక: ఇరాన్ అణు సంక్షోభానికి చెక్?

 Ten scientists

హైపర్ సోనిక్ మిస్సైల్ టెక్నాలజీ: శబ్ద వేగం కంటే ఐదు రెట్లు వేగంగా ప్రయాణించే క్షిపణుల రూపకర్తలు. క్వాంటం కంప్యూటింగ్: భవిష్యత్ యుద్ధ తంత్రాన్ని మార్చగల కంప్యూటింగ్ నిపుణులు. న్యూక్లియర్ ఫిజిక్స్: అణు ఆయుధాల తయారీ మరియు వాటి భద్రతకు సంబంధించిన రహస్య కోడ్‌లు తెలిసిన మేధావులు.

Ten scientists: వైట్ హౌస్ ఆందోళన, భద్రతా సంస్థల అలర్ట్

వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ఈ అంశంపై స్పందిస్తూ, ఇది అత్యంత తీవ్రమైన విషయమని పేర్కొన్నారు. ఎఫ్‌బీఐ (FBI) మరియు సీఐఏ (CIA) వంటి అగ్రశ్రేణి దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. డేటా లీకేజీ భయం: శాస్త్రవేత్తలతో పాటు వారి వద్ద ఉన్న అత్యంత రహస్యమైన డిజిటల్ డేటా కూడా శత్రు దేశాల చేతికి చిక్కిందా అన్నది ప్రధాన ఆందోళన. ట్రంప్ ప్రభుత్వం ఈ కేసును కేవలం మిస్సింగ్ కేసుగా కాకుండా, జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణించి దర్యాప్తు చేస్తోంది. అమెరికాను శాస్త్ర సాంకేతిక రంగాల్లో వెనక్కి నెట్టేందుకు శత్రు దేశాలు ఈ వ్యూహాన్ని అమలు చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అమెరికాలోని మేధావులను లోబర్చుకోవడం లేదా వారిని తమ దేశానికి తీసుకెళ్లడం ద్వారా అగ్రరాజ్యాన్ని బలహీనపరచడం చైనా పాత వ్యూహం. రష్యా ప్రతీకారం: ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అమెరికా విధించిన ఆంక్షలకు ప్రతికారంగా రష్యా తన గూఢచారి వ్యవస్థ ‘SVR’ను ప్రయోగించినట్లు వార్తలు వస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

భవిష్యత్తులో ఇరాన్, అమెరికా ఏం చేయబోతున్నాయి?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha