Abhishek Sharma IPL Fine: ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అద్భుత ఫామ్‌లో ఉన్నప్పటికీ, యువ ఓపెనర్ అభిషేక్ శర్మ క్రమశిక్షణా రాహిత్యం కారణంగా వార్తల్లో నిలిచారు.
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసినందుకు అతనికి భారీ జరిమానా విధించారు.
Read Also:SRH vs KKR Match Score: కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్
Abhishek Sharma IPL Fine: అసలేం జరిగింది?
నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ఆరంభంలో అభిషేక్ శర్మ అవుట్ అయిన తీరుపై వివాదం మొదలైంది.తను ఇచ్చిన క్యాచ్ విషయంలో అంపైర్ ఇచ్చిన ‘అవుట్’ నిర్ణయం పట్ల అభిషేక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.మైదానం వీడుతున్న సమయంలో అసహనంతో అంపైర్లను ఉద్దేశించి అభ్యంతరకరమైన భాషను ఉపయోగించినట్లు టీవీ రీప్లేలు, అంపైర్ల నివేదికలో వెల్లడైంది. ఇది ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.3 (మైదానంలో అసభ్య పదజాలం వాడటం) కిందకు వస్తుంది.
Abhishek Sharma Fined IPL 2026
అభిషేక్ శర్మ తన తప్పును అంగీకరించడంతో విచారణ లేకుండానే జరిమానాను ఖరారు చేశారు. 25 శాతం మ్యాచ్ ఫీజు కోత అనేది ఆర్థికంగా పెద్ద దెబ్బే అయినప్పటికీ, డీమెరిట్ పాయింట్ రావడం అనేది భవిష్యత్తులో ఆటగాడికి ఇబ్బందికరంగా మారుతుంది. ఒకవేళ నిర్ణీత కాల వ్యవధిలో మరిన్ని ఇలాంటి పాయింట్లు అతని ఖాతాలో చేరితే, ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల పాటు నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. యువ ఆటగాళ్లు ఇలాంటి భావోద్వేగాలను నియంత్రించుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
చెపాక్‌లో చెన్నై 'సూపర్' ఫైట్.. పంజాబ్‌తో పోరులో బోణీ కొట్టేనా?

