Dailyhunt
అంపైర్ల తప్పిదమా? వ్యూహమా? సీఎస్‌కే మ్యాచులో 'కంకషన్' వివాదం!

అంపైర్ల తప్పిదమా? వ్యూహమా? సీఎస్‌కే మ్యాచులో 'కంకషన్' వివాదం!

వార్త 1 week ago

CSK vs MI highlights: ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌ ఒక కొత్త వివాదానికి తెరలేపింది.

మిచెల్ శాంట్నర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ ‘కంకషన్ సబ్‌స్టిట్యూట్’ (Concussion Substitute) గా రావడంపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Read Also:IPL 2026 : హార్దిక్ కు ఏమైంది..? మరి ఇంత దారుణమా ?

అసలేం జరిగింది?

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సీఎస్‌కే ఆటగాడు మిచెల్ శాంట్నర్ భుజానికి గాయమైంది. అయితే, నిబంధనల ప్రకారం కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ను కేవలం తలకు గాయమైతేనే (Concussion) అనుమతిస్తారు. కానీ, శాంట్నర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్‌కు రావడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. “భుజం గాయానికి కంకషన్ రూల్ ఎలా వర్తిస్తుంది?” అంటూ క్రికెట్ ఫ్యాన్స్ అంపైర్ల నిర్ణయాన్ని తప్పుబట్టారు.

 Shardul Thakur concussion substitute vs MI

CSK vs MI highlights: కోచ్ క్లారిటీ

ఈ వివాదంపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే స్పందించారు. శాంట్నర్‌కు కేవలం భుజానికే కాకుండా, తలకూ గాయమైందని ఆయన వెల్లడించారు. అందుకే నిబంధనల ప్రకారమే అంపైర్లు శార్దూల్ ఠాకూర్‌ను సబ్‌స్టిట్యూట్‌గా అనుమతించారని స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదానికి తెరపడినట్లయింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఇషాన్ కిషన్, పంత్ రికార్డులు బ్రేక్.. సెంచరీల రారాజుగా సంజు శాంసన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha