Ajith Kumar Mother Demise: తమిళ చిత్ర పరిశ్రమ (కోలీవుడ్) అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్ (Ajith Kumar) కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి మోహిని మణి (Mohini Mani) శనివారం ఉదయం కన్నుమూశారు.
గత కొంతకాలంగా వయోసహజ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు.
Read also:Peddi cinima Pre-release: విజయవాడలో జూన్ 1న పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్
Ajith Kumar Mother Demise: సోషల్ మీడియాలో అభిమానుల సంతాపం!
Ajith Kumar Family Tragedy
తల్లి మరణంతో హీరో అజిత్ తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, దర్శకులు, నటీనటులతో పాటు కోట్లాది మంది అభిమానులు అజిత్ కుటుంబానికి తమ గాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. అంత్యక్రియలకు సంబంధించిన వివరాలు కుటుంబ సభ్యుల నుండి అధికారికంగా తెలియాల్సి ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

