Peddi cinima Pre-release: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'.
ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. జూన్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ భారీ వేడుకను నిర్వహించబోతున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేసింది. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ సహా చిత్ర యూనిట్ మొత్తం సందడి చేయనుంది.
PeddiPreReleaseEvent
జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..
వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇందులో కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండటంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
Peddi cinima Pre-release: ఏపీలో టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్!
ఇప్పటికే ముంబైలో ట్రైలర్ లాంచ్, ఢిల్లీలో ప్రెస్ మీట్‌తో నేషనల్ వైడ్‌గా బజ్ క్రియేట్ చేసిన ‘ペద్ది’ టీమ్.. ప్రమోషన్లలో దూసుకుపోతోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 3 నుంచి ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతులు ఇచ్చింది. రిలీజ్‌కు ముందే విజయవాడలో జరగబోయే ఈ ఈవెంట్‌తో సినిమా హైప్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

