Anakapalli road accident: అనకాపల్లి జిల్లాలో శనివారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కసింకోట మండలం తాళ్లపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఒక మహీంద్ర వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Read Also : Suryapet BRS Leader: సూర్యాపేటలో బీఆర్ఎస్ నేత దారుణ హత్య!
Fatal accident in Anakapalle.. Couple dies on the spot!
Anakapalli road accident: భద్రాచలం నుంచి వస్తుండగా విషాదం
వివరాల ప్రకారం.. మునగపాక మండలానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు భద్రాచలం పుణ్యక్షేత్రానికి వెళ్లారు. అక్కడ దైవ దర్శనం ముగించుకుని, తిరిగి తమ స్వగ్రామానికి వస్తుండగా తాళ్లపాలెం సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. మహీంద్ర వాహనం అదుపుతప్పి, రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు వాహనం ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే కసింకోట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. మృతులను మునగపాక మండలానికి చెందిన ఆడారి కూర్మారావు (42), అతని భార్య జ్యోతి (31)గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురిని పోలీసులు తక్షణ చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కూర్మారావు, జ్యోతిల మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల కోసం అనకాపల్లిలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. దైవ దర్శనం ముగించుకుని సంతోషంగా ఇళ్లకు తిరిగి వస్తున్న కుటుంబంలో ఈ ఘోర ప్రమాదం జరగడంతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

