Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అనంతలో రాష్ట్ర నేతల హడావుడి.. మూడు రోజులు ముగ్గురు నేతలు

అనంతలో రాష్ట్ర నేతల హడావుడి.. మూడు రోజులు ముగ్గురు నేతలు

వార్త 3 months ago

ముందుగా రానున్న వైఎస్ జగన్

YS Jagan: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ వారం రోజుల్లో రాష్ట్ర స్థాయి నాయకుల హడావుడి నెలకొంది. సిఎం చంద్రబాబు, మాజీ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ వేరువేరుగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు వస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

సిఎం పర్యటన అధికారికంగా ఖరారు కావాల్సింది. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి ఎయిర్పోర్ట్ సమీపంలో మొదటి విడతలో 350 ఎకరాల విస్తీర్ణంలో విమానాల విడిభాగాల తయారీ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండో విడతలో 650 ఎకరాల్లో ఆ పరిశ్రమను విస్తరించనుంది. ఇందులో భాగంగా విమానాల విడిభాగాల తయారీ కేంద్రంను రామచంద్రంగా శంకుస్థాపన చేసేందుకు ఈనెల 15వ తేదీన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టపర్తికి వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తోంది.

Read also: Nara Lokesh Singapore Visit: నేడు సింగపూర్ కు మంత్రి లోకేష్

 Leaders visiting Anantapur district.

YS Jagan: నారా లోకేష్ రెండ్రోజుల పర్యటన

దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తు న్నారు. అయితే సిఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన సంబంధించి అధికా రికంగా ప్రకటించాల్సి ఉంది. ఇదే సమయంలో 14, 15 తేదీల్లో టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి లోకేష్ జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 14న మధ్యాహ్నం ఆర్డిటి హాస్పిటల్ సందర్శించి, సాయంత్రం అనంతపురం చేరుకొని ఆర్డిటికీ ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యువల్ జరిగిన నేపథ్యంలో ఆ సంస్థ నిర్వాహకులు మంచో ఫెర్రర్, అన్నే ఫెర్రర్ను మంత్రి లోకేష్ కలవనున్నారు. ఆ తర్వాత అనంతపురంలో అర్బన్ నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.

చంద్రబాబు పర్యటనలో భారీ ప్రాజెక్టులు

మంత్రి లోకేష్ సమావేశం నిర్వహించనున్న సభాస్థలిని విజయవాడ నుంచి వచ్చిన మంత్రి లోకేష్ టీంతో కలిసి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మైదానంలో ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. శ్రీనగర్ కాలనీలో గల్లా టౌన్ షిప్ మైదానం వేదిక సమావేశం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. సమావేశంలో ఎంత మంది పాల్గొంటారు, ఇక్కడ ఏర్పాట చేయాల్సిన సౌకర్యాలు గురించి చర్చించారు. ఇదిలా ఉండగా మాజీ ముఖ్యమంత్రి, వైసిపి రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 12వ తేదీన జిల్లా పర్యటనకు వస్తున్నారు. పామిడిలో వైసిపి నేత వీరాంజనేయులు కుమార్తె ఎమ్మెల్సీ మధుసూదన్ కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించనున్నారు. అయితే ఆరోజు వైసిపి పార్టీ కార్యక్రమాల: అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవని, పెళ్లికి వచ్చి వెళతారని వైసిపి నాయకులు చెబుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

పిపిపి ద్వారా రెండేళ్లలో 2,500 ఎంబిబిఎస్ సీట్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha