పలు కీలక సమావేశాలకు హాజరు
Nara Lokesh Singapore Visit: ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు.
సోమవారం ఆయన సింగపూర్లో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. ఇందులో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. షెడ్యూల్ ప్రకారం, సోమవారం ఉదయం 10 గంటల నుంచి 11:30 గంటల వరకు ఎంటీఐ కార్యాలయంలో జరిగే జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో లోకేష్ పాల్గొంటారు.
Read also: Tamil Nadu Assembly Pro-tem Speaker: తమిళనాడు ప్రొటెం స్పీకర్‌గా ఎం.వి. కరుప్పయ్య నియామకం
Singapore Suntec City business towers
Nara Lokesh Singapore Visit: సన్ టెక్ సిటీలో వ్యాపార చర్చలు
అనంతరం మధ్యాహ్నం సింగపూర్లోని సన్ టెక్ సిటీలో వరుస భేటీలు జరపనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 2:30 గంటల వరకు కమోడిటీస్ ఇంటిలిజెన్స్ సెంటర్ (సీఐసీ) సీఈవో, సీఎఫ్ఎలతో సమావేశమవుతారు. ఆ తర్వాత 2:30 నుంచి 3 గంటల వరకు డీపీ ఆర్కిటెక్ట్స్ సంస్థ ప్రతినిధులతో లోకేష్ భేటీ అవుతారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

