ఆ ఆసుపత్రుల్లోని 70 శాతం పడకలు పేదలకు ఉచితవైద్యం : మంత్రి కొల్లు రవీంద్ర
AP Medical Colleges: పిపిపి విధానం ద్వారా రెండేళ్లలో 2500 ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
పిపిపి ఆసుపత్రుల్లో 70 శాతం పడకలు ఎన్టీఆర్ వైద్య సేవ, ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులకు కేటా యించి పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. ఆదివారం టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీ నేతలపై తీవ్ర విమర్శలు చేసారు. ఆనాడు అరాచకాలు చేసి నేడు నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేసారు. విద్యా, వైద్య రంగాలను జగన్ సర్కార్ నాశనం చేసిందనీ ఆరోపణ. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టింది వైసీపీయేనని ఫైర్. పిపిపి విధానంతోనే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం. వైఎస్సార్సీ నేతలు నాడు ప్రజల పీకలు కోసి, అరాచకాలకు పాల్పడి నేడు నీతులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Read also: AP Borewell Ban : ఏపీలో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకాలపై నిషేధం
New Medical Colleges in AP
AP Medical Colleges: రెండేళ్లలో 2500 ఎంబీబీఎస్ సీట్లు
వారి ఉత్తర కుమార ప్రగల్భాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గత వైఎస్సార్సీ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రస్తుత కూటమి ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. వైద్య రంగంలో వాస్తవాలు ఇవి ఓ స్వయం ప్రకటిత మేధావి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తామే కట్టామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ అని, ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 22 మెడికల్ కాలేజీలు నిర్మించారని గుర్తు చేశారు. ప్రతిష్టాత్మక ఎయిమ్స్ ఎపికి తీసుకొచ్చింది. చంద్రబాబే అయితే, దానికి ఐదేళ్ల పాటు కనీసం తాగునీరు కూడా ఇవ్వని నీచ చరిత్ర జగన్ రెడ్డిదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎయిమ్స్ కృష్ణా జలాలను అందించిన ఘనత తమదేనని స్పష్టం చేశారు.
పేదలకు 70 శాతం ఉచిత వైద్యం
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం తప్ప జగన్ చేసిందేమిటి? రూ.8480 కోట్ల అంచనాతో 17 కాలేజీల నిర్మాణానికి కేంద్రం నిధులు మినహా రాష్ట్రం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు అని ఆరోపించారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో పనులు ఆలస్యమవుతాయనే ఉద్దేశంతోనే ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ విధానాన్ని ఎంచుకున్నారు. విద్యా వ్యవస్థను ధ్వంసం చేశారు. జగన్ రెడ్డి హయాంలో విద్యా రంగం పూర్తిగా నాశనమైందని కొల్లు రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క డిఎస్సీ నిర్వహించలేదు. వేలాది స్కూళ్లను మూసివేసి గ్రామీణ విద్యార్థులను చదువుకు దూరం చేశారు. పదో తరగతి ఉత్తీర్ణత 62 శాతానికి పడిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని 85 శాతానికి పెంచిన ఘనత నారా లోకేశ్. అధికారంలోకి రాగానే 16వేల ఉపాద్యాయ పోస్టులను భర్తీ చేశాం అని తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

