Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అనంతపురంలో 'రణబాలి' గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ కు వేదిక ఖరారు

అనంతపురంలో 'రణబాలి' గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ కు వేదిక ఖరారు

వార్త 2 days ago

Ranabali Success Event: టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ, క్రేజీ కథానాయిక రష్మిక మందన్నా జంటగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'రణబాలి'. దసరా పండుగ కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని అందుకుని, బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతోంది.

టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన ఈ చిత్రం విజయ్-రష్మిక కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌ను మరోసారి నిరూపించింది.

Read Also : Emo Emo Idi Movie: రోషన్ మేకా 'ఏమో ఏమో ఇది' విడుదల వాయిదా

 Venue finalized for the grand success event of ‘Ranabali’ in Anantapur

Ranabali Success Event: అనంతపురంలో విజయత్సవ వేడుక

సినిమా సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపేందుకు భారీ సక్సెస్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. అక్టోబర్ 23న అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలోని ‘హార్మోని సిటీ’ ఆవరణలో సాయంత్రం 5 గంటల నుంచి ఈ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌ను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ, రష్మికతో పాటు చిత్రయూనిట్ మొత్తం హాజరుకానుంది.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ ప్రముఖ సంగీత ద్వయం అజయ్-అతుల్ అందించిన స్వరాలు మరియు నేపథ్య సంగీతం (BGM) ఈ చిత్ర విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. విజయ్ దేవరకొండ నటన, రాహుల్ సాంకృత్యాన్ మేకింగ్ శైలికి ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు లభిస్తున్నాయి.

క్షమాపణలు కోరిన రణబీర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha