Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అనర్హత వేటుపై దానం నాగేందర్ కీలక కామెంట్స్!

అనర్హత వేటుపై దానం నాగేందర్ కీలక కామెంట్స్!

వార్త 2 weeks ago

Danam Nagender: పార్టీ ఫిరాయింపుల కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. హైకోర్టు తీర్పును తాను పూర్తిగా చదివానని తెలిపారు.

ఈ తీర్పుపై వ్యక్తిగతంగా సుప్రీంకోర్టును ఆశ్రయించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.

Read Also :Disqualification : అనర్హత వేటు.. సుప్రీంకోర్టుకు వెళ్లడంపై దానం క్లారిటీ

సుప్రీంకోర్టుకు వెళ్లాలా? వద్దా?

హైకోర్టు తీర్పుపై తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలా? వద్దా? అనేది అసెంబ్లీ స్పీకర్ నిర్ణయించాల్సిన అంశమని దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తాను వ్యక్తిగతంగా సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో లేనట్లు తెలిపారు. తెలంగాణ హైకోర్టు ఇటీవల స్పీకర్ ఇచ్చిన అనర్హత పిటిషన్ల తిరస్కరణ ఉత్తర్వులను కొట్టివేసి, దానం నాగేందర్ 2024 ఏప్రిల్ 23 నుంచే ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేసే ప్రక్రియకు వీలుగా తీర్పు కాపీని స్పీకర్, ఎన్నికల సంఘానికి పంపాలని ఆదేశించింది.

Danam Nagender: సీఎం రేవంత్‌ను కలిశానన్న దానం

హైకోర్టు తీర్పు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినట్లు దానం నాగేందర్ తెలిపారు. సీఎం తనను 'నువ్వు ఫైటర్‌వి.. ధైర్యంగా పోరాడదాం' అంటూ ప్రోత్సహించారని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎన్నికలు తనకు కొత్తేమీ కాదని దానం నాగేందర్ అన్నారు. నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పనిచేయడానికి, అవసరమైతే ఉపఎన్నికను ఎదుర్కొనేందుకు తాను, తన పార్టీ కేడర్ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి తదుపరి ఎన్నికల ప్రక్రియపై ఎన్నికల సంఘం నుంచి వచ్చే ఆదేశాలు కీలకం కానున్నాయి.

సుప్రీంకోర్టును ఆశ్రయించను: దానం నాగేందర్ కీలక ప్రకటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha