Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అన్నదాతలకు అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు:  హరీష్ రావు భరోసా!

అన్నదాతలకు అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు: హరీష్ రావు భరోసా!

వార్త 2 months ago

నిన్న కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలతో జరిగిన పంట నష్టం పై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) ఆవేదన వ్యక్తం చేసారు.. అన్నదాతలు ఆందోళన చెందొద్దు అధైర్య పడొద్దని రైతులకు అండగా ఉంటానని భరోసానిచ్చారు.

జరిగిన నష్టం పై జిల్లా కలెక్టర్, జిల్లా, నియోజకవర్గ వ్యవసాయ అధికారులతో ఫోన్ లో మాట్లాడారు.. సిద్దిపేట అర్బన్ మండలం లో ఎక్కువ నష్టం జరిగిందని తన ద్రుష్టి కి వచ్చిందని, సిద్దిపేట నియోజకవర్గం ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందో అయ గ్రామాల్లో క్షేత్ర స్థాయి లో నష్ట పోయిన పంటను పరిశీలించి ప్రభుతత్వానికి నివేదిక పంపాలని ఆదేశించారు. అకాల వర్షాలకు చేతికి వచ్చిన పంట నేల పాలయిందని రైతు లు ఆందోళన లో ఉన్నారని రైతు లను అదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

Read Also :RTC Strike: పోలీసుల కాళ్లు పట్టుకున్న ఆర్టీసీ కార్మికులు.. శంకర్ గౌడ్ నివాళికి నిరాకరణ!

ఇప్పటికి ఐదు సార్లు వడగండ్ల వానలకు, ఒక సారి తుఫాన్ తో రైతులకు పంట నష్టం జరిగిందని గుర్తు చేశారు.. మామడి,పండ్ల తోటలు, వరి, మొక్క జొన్న పంటలకు నష్టం జరిగి రైతు లకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.. గతం లో ముగ్గురు మంత్రులు కలసి సిద్దిపేట నియోజకవర్గం లోని ఇబ్రహీంనగర్ గ్రామం లో నష్టపోయిన పంటను పరిశీలించారు కానీ ప్రభుత్వం నేటికీ ఏ ఒక్క రైతుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. అటు రైతు లకు రైతు బందు ఇవ్వక, ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వక, ముగ్గురు మంత్రులు వచ్చి హామీ ఇచ్చిన నేటికి పంట నష్ట పరిహారం చెల్లించక రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని, బడ్జెట్ లో పెట్టిన పంటల బీమా ఇవ్వకుండా రైతు లను మోసం చేస్తుందని హరీష్ రావు(Harish Rao) మండి పడ్డారు.. ఈ సందర్బంగా వెంటనే ఆరు విడుతల్లో పంట నష్ట పరిహారం రైతు లకు చెల్లించాలని డిమాండ్ చేసారు..

అదేవిదంగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు అమ్ముకోడానికి తెచ్చిన ధాన్యం నిన్న కురిసిన అకాల వర్షాలకు తడిచి రైతులను తీవ్ర ఆందోళన ను గురి చేసిందని ప్రతి గింజని ప్రభుత్వం కొనాలని, అదేవిదంగా కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి, మిలర్స్ తో మాట్లాడి ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు చేసి పంపిణీ చేయాలనీ ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ని కోరిన హరీష్ రావు.

  1. రైతులను మరోసారి మోసగించకండి.
  2. రైతులు అధైర్య పడొద్దు… మీకు అండగా నేను ఉన్న.
  3. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతు ల పై చిన్న చూపు తగదు.
  4. నిన్న కురిసిన అకాల వర్షాల కు నష్ట పోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి.
  5. జిల్లా కలెక్టర్, జిల్లా నియోజకవర్గ వ్యవసాయ అధికారులతో ఫోన్ లో మాట్లాడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.
  6. నిన్న వడగండ్ల వర్షాల కు పంట నష్టం పై ప్రభుత్వం కు నివేదిక పంపాలని అధికారులకు ఆదేశించిన హరీష్ రావు.
  7. రైతు బందు ఇవ్వక, పంట నష్టం పరిహారం ఇవ్వక అన్నదాత లను ఆగం చేస్తున్న ప్రభుత్వం.
  8. గతం లో ముగ్గురు మంత్రులు వచ్చి దెబ్బ తిన్న పంటలను పరిశీలించిన నేటి వరకు ఒక్క రూపాయి పరిహారం అందించలేదు.
  9. ఐదు విడుతల్లో పంట నష్ట పరిహారం ఇవ్వకుండా రైతు లకు తీవ్ర అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
  10. బడ్జెట్ లో పెట్టి పంట బీమా ఇవ్వకుండా రైతు లను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది.
  11. ఇప్పటికి వడగండ్ల వానలతో ఐదు సార్లు , ఒక సారి తుఫాన్ తో పంట నష్టం జరిగింది.
  12. ఆరు విడుతల్లో పంట నష్ట పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.
  13. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిన్న చూపు చూడటం పై మండిపడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

శంకర్ గౌడ్ మృతికి సంతాపంగా భారీ మౌన ప్రదర్శన!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha