Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అన్నం పెట్టలేదని కోపంతో భార్యపై భర్త కొడవలితో దాడి

అన్నం పెట్టలేదని కోపంతో భార్యపై భర్త కొడవలితో దాడి

వార్త 1 month ago

గొడవకు దారితీసిన చిన్న కారణం

Polavaram crime: మెట్టగూడెం గ్రామంలో రాజేంద్ర ప్రసాద్ తన భార్య పాపాయమ్మను అన్నం పెట్టమని అడిగాడు. ఆ సమయంలో భార్యాభర్తల మధ్య మాటా మాటా పెరిగి గొడవ మొదలైంది.

కోపం పెంచుకున్న భర్త ఇంట్లోని కొడవలి తీసుకుని భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు.

Read also: UP Crime: పెళ్లిలో పెను విషాదం.. వరుడిని కాల్చి చంపిన దుండగులు

 Husband attacked wife in Polavaram

Polavaram crime: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు

తీవ్ర గాయాలైన పాపాయమ్మ రక్తపు మడుగులో పడి ఉండటం చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆమెను వెంటనే గోకవరం ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి మార్చారు. ప్రస్తుతం ఆమె అక్కడ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది.

కేసు నమోదు చేసిన దేవీపట్నం పోలీసులు

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు రాజేంద్ర ప్రసాద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. కుటుంబ సమస్యల వల్ల ఇలాంటి ఘోరం జరగడం స్థానిక గ్రామంలో తీవ్ర కలకలం రేపింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఆస్తి కోసం కోడలి మృతదేహానికి అత్తింట్లోనే గుంత!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha