AP Politics: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీయే నేతలతో నిర్వహించిన సమావేశంలో మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి అంటే జగన్ కు ద్వేషమని, అందుకే ఆ పేరు పలకడానికి కూడా ఇష్టపడకుండా మావిగన్ వంటి వింత పేర్లను వాడుతున్నారని మండిపడ్డారు.
గత ఐదేళ్ల పాలనలో రాజధాని లేకుండా చేసి రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ తీరు ఇప్పటికీ మారలేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Read also: Anantapur: డీ.హిరేహళ్‌లో సర్పంచ్‌లకు ఘన వీడ్కోలు

Let us celebrate the capital in all the villages: Chandrababu
AP Politics: ప్రజల ఆకాంక్ష
అమరావతి అనేది కేవలం ఒక ప్రాంతం మాత్రమే కాదని, అది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం మరియు సెంటిమెంట్ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించాలనే సంకల్పంతో అడుగులు వేస్తుంటే, ప్రతిపక్షాలు అడ్డుతగలడం సరికాదని హితవు పలికారు. రాజధాని అభివృద్ధి కోసం తాము కట్టుబడి ఉన్నామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతిని నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.
ఊరూరా పండగలా రాజధాని సంబరాలు
అమరావతికి పూర్వ వైభవం వస్తున్న తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ రోజు సాయంత్రం అన్ని గ్రామాల్లో ప్రజలు, కూటమి నాయకులు కలిసి పండగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఐదేళ్ల చీకటి పాలన ముగిసి రాజధాని నిర్మాణానికి మార్గం సుగమమైందని, ఈ విజయాన్ని ప్రజలందరూ సెలబ్రేట్ చేసుకోవాలని ఆయన కోరారు. గ్రామ గ్రామాన అమరావతి నినాదం మార్మోగాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

