Medak Inter Thieves Arrest; మెదక్ ల్లో గత కొంతకాలంగా వివిధ జిల్లాల్లో వరుస దోపిడీలతో ప్రజలను, వ్యాపారులను వణికించిన అంతర్ జిల్లా దొంగల (Inter-District Thieves) ముఠా ఆటను మెదక్ జిల్లా పోలీసులు బుధవారం ముగించారు.
మెదక్ డీఎస్పీ (DSP) ప్రసన్నకుమార్ బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సంచలన కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ పాతనేరస్థుల ముఠాపై తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్లలో ఏకంగా 23 దొంగతనం కేసులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 14వ తేదీన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం చీలపల్లి గ్రామంలో ఒక ఇంట్లో చొరబడిన దొంగలు కిలోకు పైగా బంగారం, రెండున్నర కిలోల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ మెగా దోపిడీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టి, ఇటీవల కొందరు నిందితులను పట్టుకుని వారి వద్ద నుండి 94 తులాల బంగారం, కిలోన్నర వెండిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, చీలపల్లి కేసులో పోయిన మిగతా బంగారం రికవరీ కోసం నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించగా, వారు గతంలో తాము చేసిన పాత దొంగతనాల చిట్టాను విప్పారు.
Read Also: Janasena Press Meet : తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చెడుగా మాట్లాడలేదు - పవన్ కళ్యాణ్ క్లారిటీ
కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో 23 దోపిడీలు..
నిందితులు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తును మరింత వేగవంతం చేసిన మెదక్ పోలీసులకు దిగ్భ్రాంతికర విషయాలు తెలిశాయి. ఈ ముఠా కామారెడ్డి జిల్లా పరిధిలోని వర్నిలో 3, నసురుల్లాబాద్‌లో 4, ఎల్లారెడ్డిలో 4 దొంగతనాలకు పాల్పడటంతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో మొత్తం 23 పెద్ద దొంగతనాలు చేసినట్లు పోలీసులు అధికారికంగా గుర్తించారు.
Chilapalli Robbery Case Cracked: 94 Tolas of Gold Recovered
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం గోప్యానాయక్ తండాకు చెందిన ప్రధాన నిందితుడు జైరాం యాదవ్‌ను పోలీసులు తమదైన శైలిలో విచారించారు. అతనిచ్చిన పక్కా సమాచారంతో బుధవారం ఉదయం చందర్నాయక్ తండా వద్ద పొంచివున్న పోలీసులు.. జైరాం యాదవ్ బంధువులు, ఈ ముఠాలో సహ నిందితులైన రాథోడ్ ఇప్పూసింగ్, బానోత్ సురేఖ, బానోత్ మీరిబాయిలను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్‌కు తరలించి తనిఖీ చేయగా వారి వద్ద నుండి 14.2 తులాల బంగారు ఆభరణాలు, 87 తులాల వెండి ఆభరణాలను బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
Medak Inter Thieves Arrest: ఇద్దరు నిందితులు పరారీ.. పోలీస్ సిబ్బందికి అభినందనలు
ఈ అంతర్ జిల్లా దోపిడీ ముఠాలో కీలక సభ్యులైన రాథోడ్ సుగుణాబాయి, బానోత్ సుభాష్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. చీలపల్లి గ్రామంలో దోచుకున్న మిగిలిన బంగారం వీరిద్దరి వద్దే ఉన్నట్లు తమకు నమ్మదగిన సమాచారం ఉందని, ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
చాలా రోజులుగా పోలీసులకు సవాల్‌గా మారిన ఈ అంతర్ జిల్లా దొంగల ముఠా గుట్టురట్టు చేసి, విలువైన సొత్తును రికవరీ చేసిన అల్లాదుర్గం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) రేణుకారెడ్డి, సబ్ ఇన్‌స్పెక్టర్లు (SI) ప్రవీణ్ రెడ్డి, శంకర్, పోచయ్యలతో పాటు పోలీస్ సిబ్బంది రామిసింగ్, వినోద్‌లను డీఎస్పీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

