Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జగన్ 'మావిగన్'పై పవన్ సెటైర్లు

జగన్ 'మావిగన్'పై పవన్ సెటైర్లు

వార్త 2 months ago

Jagan Mavigun : ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెరపైకి తెచ్చిన 'మావిగన్' (MAVIGUN) కారిడార్ ప్రతిపాదనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో సెటైర్లు వేశారు.

గతంలో అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులంటూ కాలయాపన చేశారని, ఇప్పుడు వాటి కథ ముగిసిపోవడంతో సరికొత్తగా 'మావిగన్' అనే కొత్త రాగాన్ని అందుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మచిలిపట్నం (MA), విజయవాడ (VI), గుంటూరు (GUN) ప్రాంతాలను కలుపుతూ మూడు జిల్లాల పరిధిలో రాజధాని కారిడార్‌ను ఏర్పాటు చేస్తామనడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పవన్ ఆరోపించారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట ప్రజల నుంచి, రైతుల నుంచి విలువైన భూములను లాక్కునేందుకే ఈ సరికొత్త ప్లాన్‌ను జగన్ ప్రతిపాదించారని ఆయన విమర్శించారు. రాజధానిపై స్పష్టమైన విధానం లేకే ఇలాంటి అనాలోచిత ప్రతిపాదనలతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు.

Read Also : డీఎస్సీ అభ్యర్థులకు అండగా ఉంటామంటూ వైఎస్ జగన్ భరోసా

రాత్రికి రాత్రే నగరాలు రావు

ఒక రాజధాని నగరం లేదా మెట్రోపాలిటన్ హబ్ అనేది రాత్రికి రాత్రే పుట్టుకురాదని, దానికి దశాబ్దాల ప్రణాళిక, నిరంతర శ్రమ అవసరమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని ఉదాహరణగా చూపిస్తూ.. హైదరాబాద్ కానీ, నేటి ఐటీ హబ్ సైబరాబాద్ కానీ ఒకే రోజులోనో లేదా కొద్ది నెలల్లోనో అంతర్జాతీయ స్థాయికి ఎదగలేదని గుర్తుచేశారు. ఎంతో మంది విజనరీ నాయకుల కృషి వల్ల, దశాబ్దాలుగా సాగుతున్న నిర్మాణాల ఫలితంగానే నేడు సైబరాబాద్ ఆ స్థాయిలో నిలిచిందని, ఇప్పటికీ అక్కడ అభివృద్ధి, కొత్త నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయని వివరించారు. అలాంటిది ఉనికిలో ఉన్న అమరావతిని కాదని, మూడు ప్రాంతాలను కలిపి సరికొత్త కారిడార్ అంటున్న జగన్ ఆలోచనలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని పవన్ దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు: హోంమంత్రి అనిత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha