Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చెడుగా మాట్లాడలేదు - పవన్ కళ్యాణ్ క్లారిటీ

తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చెడుగా మాట్లాడలేదు - పవన్ కళ్యాణ్ క్లారిటీ

వార్త 1 week ago

Janasena : ఇటీవల అమరావతి వేదికగా తెలుగు రాష్ట్రాల సామాజిక పరిస్థితులపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పత్రికా సమావేశం (Press Meet) ద్వారా పూర్తి స్పష్టతనిచ్చారు.

తాను తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఎలాంటి తప్పుడు లేదా చెడు వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. “నన్ను తెలంగాణలో అడుగుపెట్టనివ్వబోం అంటూ గతంలో కొందరు రాజకీయ నాయకులు చేసిన హెచ్చరికలు, వారి వైఖరిని ఉద్దేశించి మాత్రమే నేను మాట్లాడాను తప్ప… తెలంగాణ సమాజాన్ని తక్కువ చేయాలనే ఉద్దేశం నాకు అస్సలు లేదు” అని వివరించారు. తెలంగాణ ముమ్మాటికీ ఆ ప్రాంత భూమిపుత్రులదేనని, అక్కడి ప్రజల భావోద్వేగాలను, ఆత్మగౌరవాన్ని తాను ఎల్లప్పుడూ గౌరవిస్తానని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.

Read Also : డీఎస్సీ అభ్యర్థులకు అండగా ఉంటామంటూ వైఎస్ జగన్ భరోసా

దేశ సమగ్రతపై జనసేనాని కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో జనసేన ప్రయాణం మరియు అక్కడి నేతలతో తనకున్న సంబంధాలపై కూడా పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తనకు ఒక సోదరుడి లాంటి వారని, తమ మధ్య ఉన్న వ్యక్తిగత బంధం ఎప్పటికీ అలాగే ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయాలని, పార్టీని బలోపేతం చేయాలని అక్కడి స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు ఎప్పటి నుంచో తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన వెల్లడించారు. రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే అయినప్పటికీ… ప్రాంతాల మధ్య విద్వేషాలు రేపుతూ దేశ సమగ్రతను, ఐక్యతను దెబ్బతీసే విధంగా ఎవరూ కూడా ప్రవర్తించకూడదని పవన్ కల్యాణ్ ఈ ప్రెస్ మీట్ ద్వారా హితవు పలికారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha