TG Inter Results 2026: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ఫలితాలను ఈ నెల 11 నుంచి 13వ తేదీల మధ్య విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే మూల్యాంకన ప్రక్రియ పూర్తికాగా, తుది ఫలితాల క్రోడీకరణ పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
Read Also : Medak District Yoga Program: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
Inter results in two more days!
లక్ష మంది విద్యార్థుల ఫలితాలపై రీ-వెరిఫికేషన్
ఈసారి సుమారు 9.97 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. అయితే, ప్రాథమిక గణాంకాల ప్రకారం కేవలం ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయిన వారు దాదాపు లక్ష మంది ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన సాంకేతిక పొరపాట్లను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఎక్కడా తప్పులకు ఆస్కారం ఉండకూడదని బోర్డు నిర్ణయించింది. అందుకే, ఒక్క సబ్జెక్టులో తప్పిన విద్యార్థుల ఆన్సర్ షీట్లను అధికారులు మరోసారి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఉంటుందని బోర్డు భావిస్తోంది.
TG Inter Results 2026: సోషల్ మీడియా ప్రచారంపై బోర్డు క్లారిటీ
ఫలితాల విడుదల కావాలనే ఆలస్యం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఇంటర్ బోర్డు తీవ్రంగా ఖండించింది. ఫలితాల ప్రక్రియ పారదర్శకతతో కూడుకున్నదని, సాంకేతిక లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొంచెం సమయం పడుతుందని స్పష్టం చేసింది. మరో రెండు రోజుల్లో అధికారికంగా ఫలితాల తేదీని ప్రకటించి, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచే అవకాశం ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

