Medak News: అంతర్జాతీయ సహకార శాఖ వారోత్సవాల సందర్భంగా మెదక్ పీఏసీఎస్ కార్యాలయంలో సోమవారం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహకార శాఖ జిల్లా అధికారి పద్మ ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు.
అనంతరం సహకార సంఘాల అభివృద్ధి, రైతులకు అందిస్తున్న సేవలు, సహకార వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె సూచించారు.
Read Also: Telangana Student Died In Spain:స్పెయిన్‌లో తెలంగాణ విద్యార్థి మృతి
International Cooperation Department’s week-long celebrations kick off in grand style.
Medak News: అధికారులు, సిబ్బంది భాగస్వామ్యం
ఈ కార్యక్రమంలో మెదక్ పీఏసీఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, ఆఫీస్ సూపరింటెండెంట్ సాయిలు, పీఏసీఎస్ మానిటరింగ్ ఆఫీసర్ ఆరెళ్ల రామా గౌడ్, సీఈవో సాయి తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సహకార రంగం అభివృద్ధికి అందరూ సమిష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.
Epaper: epaper.vaartha.com
రానున్న 2-3 గంటల్లో ఈ జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు!

