Chandrababu Birthday: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు నేడు (సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ మరియు టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆయనకు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
Chandrababu Birthday: ప్రధాని మోదీ ప్రశంసలు
ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. చంద్రబాబును తన “మంచి మిత్రుడు”గా అభివర్ణించారు.చంద్రబాబు, రాష్ట్రం కోసం నిరంతరం శ్రమించే ముఖ్యమంత్రి అని కొనియాడారు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో దూసుకెళ్తోందని ప్రశంసించారు. ప్రజలకు సేవ చేస్తూ ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఎన్టీఆర్ ఆత్మీయ ట్వీట్
గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ, తన మామయ్య చంద్రబాబు పుట్టినరోజున యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.'ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మావయ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిరంతరం నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని..
అదే పట్టుదల, విజన్‌తో మన ప్రజలకు సేవ చేసే శక్తి మీకు లభించాలని కోరుకుంటున్నాను. మీ నాయకత్వం మన రాష్ట్రానికి నిరంతర అభివృద్ధిని, సమృద్ధిని, గర్వకారణమైన గుర్తింపును తెచ్చిపెడుతూ అందరికీ స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నాను' అంటూ తారక్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తారక్ ట్వీట్‌పై టీడీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయన్ని అభినందిస్తున్నారు.
సీఎం చంద్రబాబు పూర్తి ఆరోగ్యంగా ఉండాలి: పవన్ కల్యాణ్
అన్ని రంగాల్లో ఏపీని ముందుకు తీసుకెళ్తున్న సీఎం చంద్రబాబు పూర్తి ఆరోగ్యంగా.. ఆనందంగా ప్రజా జీవితంలో ముందుకు వెళ్లాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.
చంద్రబాబు ఆరోగ్యంగా.. ప్రశాంతంగా ఉండాలి: జగన్
ఇక.. మాజీ సీఎం జగన్ సైతం ప్రత్యేకంగా చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యంగా.. ప్రశాంతంగా ఉండాలని పేర్కొన్నారు.
చంద్రబాబుకు షర్మిల బర్త్ డే విషెస్
పీసీసీ చీఫ్ షర్మిల సైతం ఎక్స్ ఖాతా ద్వారా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెప్పారు. చంద్రబాబుకు ఆ భగవంతుడు దీర్ఘాయుష్షు.. ఆరోగ్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
నేను ఏ తప్పు చేయలేదు..కడిగిన ముత్యంలా వస్తా: ఎంపీ పుట్టా మహేష్ కుమార్

