Putta Mahesh Kumar: తాను నిష్కళంకితుడననీ, హైదరాబాద్ డ్రగ్స్ కేసులో తన పాత్ర ఏమీ లేదని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఒక ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీకి వెళ్లారని ఆరోపణలు ఎదుర్కొన్న తరువాత ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 40 రోజుల తర్వాత ఆదివారం మళ్ళీ ఏలూరులో అడుగు పెట్టారు.ఈ సందర్భంగా ఏలూరు ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ డ్రగ్స్ కేసులో తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు.
తనపై వచ్చిన ఆరోపణలన్ని తప్పని, డ్రగ్స్ కేసు విచారణలో కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ఎంపీ విశ్వాసం వ్యక్తం చేశారు.
Read Also: Srisailam Silver Nagabharanam: మల్లన్నకు వెండి నాగాభరణం విరాళం
Putta Mahesh Kumar: మీడియా కథనాలపై ఆవేదన
కేసు ఇంకా విచారణ దశలోనే ఉన్నందున దానిపై ఎక్కువగా మాట్లాడలేనని, మీడియా సంయమనం పాటించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. తాను ఏ తప్పు చేయకపోయినా మీడియాలో వచ్చిన కథనాలతో మనస్థాపానికి గురయ్యాయని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు తనకు మద్దతుగా నిలిచారన్నారు. కష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.
ఇకనుంచి మళ్ళీ ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతానని, ఏలూరు పార్లమెంటు అభివృద్ధికి అంకితమై పని చేస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు.ఈసందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, రోషన్ కుమార్, ధర్మరాజు, అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఇతర నేతలు ఎంపీ మహేశ్ ను మర్యాదపూర్వకంగా కలిసారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి: మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా

