Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AP Local Elections: మరో హామీ అమలు దిశగా చంద్రబాబు అడుగులు?

AP Local Elections: మరో హామీ అమలు దిశగా చంద్రబాబు అడుగులు?

వార్త 3 months ago

AP Local Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మళ్లీ మొదలుకానుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీలు, మండల పరిషత్‌లు, జడ్పీ సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.

జూన్‌లోగా అన్ని లోకల్ బాడీస్ ఎన్నికలను పూర్తి చేయాలని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారు.

March Holidays: మార్చి నెలలో వరుస సెలవుల జాబితా

34 శాతం రిజర్వేషన్లు అమలు

ఈ క్రమంలో చంద్రబాబు మరో కీలక హామీని అమలు చేసేందుకు అడుగులు వేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, జడ్పీ ఛైర్మన్ల సీట్లలో బీసీ రిజర్వేషన్లు పెంచాలని అనుకుంటున్నారు. బీసీలకు రాజకీయంగా మేలు చేసే ఉద్దేశంతో ఏకంగా 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha