Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AP NMMS స్కాలర్‌షిప్ గడువు పెంపు

AP NMMS స్కాలర్‌షిప్ గడువు పెంపు

వార్త 1 week ago

AP NMMS scholarship:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి అభ్యసించే విద్యార్థులకు AP NMMS స్కాలర్‌షిప్ 2026 దరఖాస్తుల గడువును విద్యాశాఖ పొడిగించింది.

అర్హత గల విద్యార్థులు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఈ నెల 27వ తేదీ వరకు ఆన్‌లైన్ లో నమోదు చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించింది. ఈ అవకాశాన్ని ప్రతిభావంతులైన పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

Papikondalu trip: నేటి నుంచి పాపికొండల బోటింగ్ షురూ

 NMMS application deadline extended…

పరీక్ష ఎప్పుడు జరుగుతుందో తెలుసా?

ఈ స్కాలర్‌షిప్ ఎంపిక కోసం నిర్వహించే రాత పరీక్ష వచ్చే నెల 29వ తేదీన జరగనుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పాఠశాల హెచ్‌ఎమ్‌ల సహాయంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. సమయం తక్కువగా ఉన్నందున చివరి నిమిషం వరకు వేచి చూడకుండా త్వరగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయడం శ్రేయస్కరం.

AP NMMS scholarship:ఏటా రూ.12,000 ఆర్థిక సాయం

ఈ పోటీ పరీక్షలో ప్రతిభ చూపి ఎంపికైన ప్రతిభావంతులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తి అయ్యే వరకు ప్రతి సంవత్సరం రూ.12,000 చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం అందుతుంది. పేద కుటుంబాల పిల్లల ఉన్నత చదువులకు ఈ ఆర్థిక సాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. అర్హత కలిగిన ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.

Epaper: epaper.vaartha.com

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వివిధ విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha