Vanaparthi Crime: అప్పుల భారంతో కుటుంబ సభ్యులను నీటి సంపులో ముంచి.. తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మహ బూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి చెందిన గంగల నర్సింహులు (40)మామిడి తోటలు లీజుకు తీసుకొని పండ్ల వ్యాపారం చేసేవాడు.
ఆరు సంవత్సరాల క్రితం స్వగ్రామంలో అప్పులు ఎక్కువై గణపురం మం డలంలోని సలకలాపూర్ గ్రామానికి సమీపంలో భీమవరానికి చెందిన శ్రీనివాసరావు మామిడి తోటను లీజుకు తీసుకొని అక్కడే రేకుల షెడ్డులో భార్యా పిల్లలతో నివాసం ఉంటున్నాడు. ఏడాది క్రితం తను చేసిన అప్పులు 70 లక్షలు దాటడంతో కోర్టుకు వెళ్లాడు. గ్రామస్తులు సర్ది చెప్పడంతో అప్పుల వారికి కొంత మొత్తం చెల్లించి మిగతా డబ్బులు తర్వాత ఇస్తానని చెప్పి గ్రామాన్ని వదిలిపెట్టాడు.
Read Also : secunderabad crime: చికిత్స పొందుతూ తప్పంచుకున్న రిమాండ్ ఖైదీ
He killed his wife and children due to debt and then committed suicide by hanging himself.
Vanaparthi Crime: ముగ్గురిని చంపి తాను ఉరేసుకొని ఆత్మహత్య
ఇటీవల మళ్లీ అప్పుల వారి బాధలు ఎక్కువ కావడంతో వారి బాధలు భరించలేక బుధవారం మధ్య రాత్రి తర్వాత తన భార్య ఎల్లమ్మ (36), కుమారుడు సాయి నిహాల్ (15) కూతురు సాహితీశ్రీ (13) ముగ్గురిని తోటలో ఉన్న సంపులో తాళ్లతో కట్టి పడేసి చంపాడు. ఈ విషయం గద్వాలలో ఉన్న తన బావమరిది వెంకటేష్కు రాత్రి ఒంటిగంట యాభై నిమిషాలకు ఫోన్ చేసి మీ చెల్లిని పిల్లలను చంపేశానని స్వగ్రా మంనుండి అప్పుల వారి బాధలు ఎక్కువ య్యాయని వాళ్ళు తనను బూతు మాటలతో వేధిస్తున్నారని నేను ఉరి వేసుకొని చనిపోతున్నా నని చెప్పి ఫోన్ పెట్టేశాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు
దీంతో తన బావ మరిది బంధువులకు సమాచారం ఇచ్చి వెంటనే బ యలుదేరారు. రాత్రంతా భారీ వర్షం కురుస్తుం డటంతో సలకలాపూర్ గ్రామానికి తెల్ల వారు జామున 6 గంటలకు చేరుకున్నారు. అప్ప టికే తన బావమరిది తన నివాసం ఉంటున్న రేకుల షెడ్డులో ఉరేసుకొని చనిపోయాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో పోలీ సులు సంఘటన స్థలానికి చేరుకొని డిఎస్పీ గిరి ధర్ ఆధ్వర్యంలో సిఐ రాంబాబు ఎస్సై వెంకటేష్ కేసు నమోదు చేసుకొని ఫంచ నామ నిర్వ హించారు అనంతరం శవాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

